Advertisement

మహిళకు సైనికుడి సాయం.. మానవత్వానికి నెటిజన్లు ఫిదా!

Indian Army soldier helps woman Netizens impressed by humanity
  • ఎలక్ట్రిక్ కారు బ్యాటరీ అయిపోవడంతో ఇబ్బంది పడిన మహిళ
  • సహాయం చేసి ఆదుకున్న భారత సైనిక జవాన్
  • ఛార్జింగ్ స్టేషన్ వరకు కారును స్వయంగా తోసిన సైనికుడు
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
  • జవాన్ సేవాభావంపై నెటిజన్ల ప్రశంసల వర్షం
ప్రయాణం మధ్యలో ఎలక్ట్రిక్ కారు బ్యాటరీ అయిపోవడంతో ఇబ్బంది పడుతున్న ఒక మహిళకు భారత సైనికుడు చేసిన సాయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ జవాన్ ప్రదర్శించిన చొరవ, నిస్వార్థ సేవపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. దీపికా శర్మ అనే వ్లాగర్ తన ఎలక్ట్రిక్ వాహనంలో ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆమె ప్రయాణం ప్రారంభించిన సమయంలో కారులో 60 శాతం ఛార్జింగ్ ఉండగా, అది అనూహ్యంగా 10 శాతానికి, ఆ తర్వాత 2 శాతానికి పడిపోయింది. ఛార్జింగ్ స్టేషన్‌కు చేరుకోవడానికి ముందే వాహనం నిలిచిపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆమె, సమీపంలో ఉన్న ఒక ఆర్మీ జవాన్‌ను సహాయం కోరారు.

ఆమె అభ్యర్థనపై వెంటనే స్పందించిన ఆ సైనికుడు.. దీపికను స్టీరింగ్ వద్ద కూర్చోమని చెప్పి, ఎండను సైతం లెక్కచేయకుండా కారును స్వయంగా ఛార్జింగ్ స్టేషన్ వరకు నెట్టుకుంటూ తీసుకెళ్లారు. కేవలం కారును చేర్చడమే కాకుండా, ఛార్జింగ్ పూర్తయి ఆమె క్షేమంగా ప్రయాణాన్ని కొనసాగించే వరకు అక్కడే ఉండి తోడ్పాటునందించారు.

ఈ అరుదైన దృశ్యాన్ని దీపికా శర్మ వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకున్నారు. సదరు జవాన్ చూపిన దయను తాను ఎప్పటికీ మరచిపోలేనని పేర్కొంటూ ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. దేశ రక్షణతో పాటు ప్రజల పట్ల భారత సైన్యం చూపే నిస్వార్థ సేవకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ సైనికుడి మానవత్వానికి, సేవా దృక్పథానికి సెల్యూట్ చేస్తున్నారు.                                
Advertisement
Indian Army Soldier
Deepika Sharma
Electric Car
Viral Video
Humanity
Indian Army

More Telugu News