12 సార్లు రిజెక్ట్.. 13వ ప్రయత్నంలో గూగుల్ ఉద్యోగం సాధించిన యువకుడు!

Rejected 12 times woman secures Google job in 13th attempt
  • 12 సార్లు తిరస్కరణకు గురైన అమెజాన్ ఇంజనీర్‌కు 13వ ప్రయత్నంలో గూగుల్‌లో ఉద్యోగం
  • పట్టుదల, సరైన వ్యూహంతోనే ఇది సాధ్యమైందని 'ఎక్స్'లో పోస్ట్
  • సాధారణ దరఖాస్తులకు బదులు ఉద్యోగుల 'రిఫరల్స్' ఎంతో ఉపయోగపడ్డాయని వెల్లడి
  • టెక్ రంగంలో ఉద్యోగాల కోసం ప్రయత్నించేవారిలో స్ఫూర్తి నింపిన ఘటన
పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని ఓ యువ ఇంజనీర్ నిరూపించాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 12 సార్లు తిరస్కరణకు గురైనా వెనక్కి తగ్గకుండా, 13వ ప్రయత్నంలో ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం గూగుల్‌లో ఉద్యోగం సంపాదించారు. ప్రస్తుతం అమెజాన్‌లో పనిచేస్తున్న అతను, తన అనుభవాన్ని సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో పంచుకోగా, ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

తన ఉద్యోగ ప్రయత్న వ్యూహాన్ని మార్చుకున్న తర్వాతే అతను ఈ ఘనత సాధించారు. తొలుత సాధారణ పద్ధతిలో దరఖాస్తు చేసినప్పుడు ఆశించిన ఫలితం రాలేదు. అయితే, గూగుల్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల నుంచి రిఫరల్స్ తీసుకోవడం, తన నైపుణ్యాలకు సరిపోయే ఉద్యోగాలకే దరఖాస్తు చేయడం వంటి మార్పులు చేయడంతో అతడికి ఇంటర్వ్యూ పిలుపు వచ్చింది. పట్టువదలకుండా శ్రమించి ఉద్యోగం సాధించాడు.

అమెజాన్‌‌లో మూడుసార్లు, మైక్రోసాఫ్ట్‌లో 16 తిరస్కరణల తర్వాత తనకు ఆఫర్ లెటర్ వచ్చిందని వెల్లడించాడు. ఆపిల్, ఒరాకిల్ కంపెనీల నుంచి ఎలాంటి ఆఫర్ రాలేదని పేర్కొన్నాడు. ఈ కంపెనీలలో దరఖాస్తు చేయడం ఒక గేమ్ అని, కాబట్టి అదృష్టం మీ వైపు ఉండేలా తగినంత కష్టపడాలని సూచించాడు. ఉద్యోగులు కూడా కేవలం యాదృఛ్చితంగా దరఖాస్తు చేసుకోవద్దని తెలిపాడు. మీ రెజ్యుమే అక్కడి ఉద్యోగానికి సరిపోయేలా ఉందో చూసుకోవాలని అన్నాడు.

ప్రస్తుతం టెక్ రంగంలో కొలువు సాధించడం ఎంతో సవాలుగా మారింది. తీవ్రమైన పోటీ, దిగ్గజ కంపెనీల లేఆఫ్‌ల కారణంగా చాలామంది అభ్యర్థులు అనేకసార్లు తిరస్కరణకు గురవుతున్నారు. గతంలోనూ మైక్రోసాఫ్ట్, మెటా వంటి కంపెనీలలో విఫలమై, ఆ తర్వాత గూగుల్‌లో ఉద్యోగాలు పొందిన వారి కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే తాజా ఘటన కూడా ఎంతోమంది నిరుద్యోగులకు స్ఫూర్తినిస్తోంది.
Advertisement
Google
Software Engineer
Job Rejection
Amazon Employee
Career Success
Tech Jobs

More Telugu News