అట్లాంటిక్ మహాసముద్రంలో 'శ్మశానవాటిక'... మనుషులుండరు... గుర్రాలదే రాజ్యం!
- అట్లాంటిక్ మహాసముద్రంలో కెనడాకు సమీపంలో సేబుల్ ఐలాండ్
- ఇక్కడ మనుషులు ఉండరు... 500 పైగా అడవి గుర్రాలకు ఆవాసం
- వందల ఓడలు మునిగినందున 'గ్రేవ్ యార్డ్ ఆఫ్ ది అట్లాంటిక్' అని పేరు
- గ్రే సీల్స్, వలస పక్షులకు ఇది కీలక ఆవాస కేంద్రం
- పర్యావరణ మార్పులపై పరిశోధనలకు ఇది ఒక సహజ ప్రయోగశాల
కెనడాలోని నోవా స్కోటియాకు ఆగ్నేయంగా 300 కిలోమీటర్ల దూరంలో అట్లాంటిక్ మహాసముద్రంలో ఓ వింతైన ప్రపంచం ఉంది. దాని పేరు సేబుల్ ఐలాండ్. ఇక్కడ మనుషుల జనాభా సున్నా. రోడ్లు లేవు, నివాసాలు లేవు. కానీ, దాదాపు 500 అడవి గుర్రాలు స్వేచ్ఛగా తిరుగుతూ జీవిస్తున్నాయి. ఇది కేవలం ఇసుకతో ఏర్పడిన ఓ సన్నని చంద్రవంక ఆకారపు ద్వీపం. సుమారు 42 కిలోమీటర్ల పొడవు, 1.5 కిలోమీటర్ల కంటే తక్కువ వెడల్పుతో ఉండే ఈ ప్రాంతం నిరంతరం గాలులు, తుపానుల తాకిడికి తన రూపాన్ని మార్చుకుంటూ ఉంటుంది.
తరచూ మారే ఇసుక దిబ్బలు, దట్టమైన పొగమంచు, భయంకరమైన వాతావరణం కారణంగా ఈ ప్రాంతంలో 350కి పైగా చారిత్రక నౌకలు మునిగిపోయాయి. అందుకే దీనికి 'గ్రేవ్ యార్డ్ ఆఫ్ ది అట్లాంటిక్' (అట్లాంటిక్ స్మశానవాటిక) అనే పేరుంది. ఇంతటి ప్రమాదకరమైన ప్రదేశంలో వందల ఏళ్లుగా అడవి గుర్రాలు మనుగడ సాగిస్తుండటం ఓ అద్భుతం. 18వ శతాబ్దంలో వలసవాదులు కొన్ని గుర్రాలను ఇక్కడికి తీసుకొచ్చి వదిలేశారని, అవే నేటి తరానికి మూలాలని చరిత్రకారులు భావిస్తున్నారు.
ఈ ద్వీపానికి ప్రధాన ఆకర్షణ ఇక్కడి అడవి గుర్రాలే. వీటికి ఎలాంటి వైద్య సంరక్షణ గానీ, ఆహారం అందించడం గానీ జరగదు. ఇవి పూర్తిగా ప్రకృతిపైనే ఆధారపడి జీవిస్తాయి. ద్వీపంలోని గడ్డి, మంచినీటి చెరువులే వీటికి ఆధారం. ఇక్కడి కఠిన వాతావరణానికి అలవాటుపడిన ఈ గుర్రాలు పొట్టిగా, దృఢంగా, దట్టమైన వెంట్రుకలతో ఉంటాయి. వీటి మనుగడ, జన్యువులు, ప్రవర్తనపై శాస్త్రవేత్తలు అధ్యయనాలు చేస్తున్నారు. ఈ గుర్రాలను చట్టపరంగా సంరక్షిస్తున్నారు.
గుర్రాలే కాకుండా, సేబుల్ ఐలాండ్ అనేక ఇతర జీవరాశులకు స్వర్గధామం. ప్రపంచంలోనే అతిపెద్ద గ్రే సీల్స్ సంతానోత్పత్తి కేంద్రాలలో ఇది ఒకటి. ప్రతి ఏటా ఇక్కడ వేలాది సీల్ పిల్లలు జన్మిస్తాయి. వీటితో పాటు హార్బర్ సీల్స్, తిమింగలాలు, డాల్ఫిన్లు, అట్లాంటిక్ ఫ్లైవే మీదుగా ప్రయాణించే వలస పక్షులకు ఇది ఒక ముఖ్యమైన విడిది కేంద్రం.
పర్యావరణపరంగా అత్యంత సున్నితమైన ఈ ద్వీపాన్ని కెనడా ప్రభుత్వం 'సేబుల్ ఐలాండ్ నేషనల్ పార్క్ రిజర్వ్'గా ప్రకటించి, ప్రజల ప్రవేశాన్ని కఠినంగా నియంత్రిస్తోంది. వాతావరణ మార్పుల ప్రభావం, తీరప్రాంత కోత, జంతువుల మనుగడ వంటి అంశాలపై అధ్యయనం చేసేందుకు ఇది ఒక సహజ ప్రయోగశాలగా ఉపయోగపడుతుంది. మానవ ప్రమేయం లేని ఈ అద్భుత ప్రపంచాన్ని వీలైనంత సహజంగా కాపాడటమే ప్రభుత్వ లక్ష్యం.