ఒంటరిగా రెస్టారెంట్‌కు వెళ్లి తినడాన్ని ఎంజాయ్ చేస్తారా? సైకాలజీ చెబుతోంది ఇదే!
- ఒంటరిగా భోజనం చేయడం అంటే ఒంటరితనం కాదంటున్న సైకాలజిస్టులు
- ఏకాంతం భావోద్వేగ పరిపక్వతకు సంకేతం అని వెల్లడి
- ‘స్పాట్‌లైట్ ఎఫెక్ట్’ వల్ల ఎక్కువ మందిలో సంకోచం
- ఏకాంతం మనసుకు ప్రశాంతతను అందిస్తుందని వివరణ
రద్దీగా ఉన్న రెస్టారెంట్‌లో అందరూ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి భోజనం చేస్తుంటారు. కానీ ఏదో ఒక టేబుల్ దగ్గర ఒక్కరే కూర్చొని ప్రశాంతంగా భోజనం చేస్తున్న వ్యక్తిని చూసి చాలామంది ఆశ్చర్యపడతారు. కొందరైతే అతను ఒంటరివాడేమో, ఎవరూ లేరేమో అనుకుంటారు. కానీ సైకాలజిస్టులు మాత్రం దీన్ని మరో కోణంలో చూస్తున్నారు. ఒంటరిగా భోజనం చేయడం అంటే ఒంటరితనానికి సంకేతం కాదని, చాలా సందర్భాల్లో అది భావోద్వేగ పరిపక్వతకు నిదర్శనమని చెబుతున్నారు.
ఒంటరితనం.. ఏకాంతం.. ఒకటి కావు
బయటకు చూస్తే ఈ రెండూ ఒకేలా కనిపిస్తాయి. కానీ మనసు పరంగా రెండింటి మధ్య పెద్ద తేడా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఒంటరితనం అనేది మనకు కావాల్సిన అనుబంధం దొరక్కపోవడం వల్ల కలిగే బాధ. చుట్టూ ఎంతమంది ఉన్నా లోపల ఖాళీగా అనిపిస్తుంది. ఏకాంతం మాత్రం మనమే ఎంచుకునే సమయం. ఆ టైమ్‌లో మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆలోచనలు గాడినపడతాయి. మళ్లీ కొత్త ఉత్సాహం వస్తుంది. ఈ తేడాను గుర్తించడం భావోద్వేగ వికాసంలో కీలక దశగా వారు చెబుతున్నారు.
మనసే ఎక్కువగా ఊహించుకుంటుంది
చాలామంది ఒంటరిగా రెస్టారెంట్‌కు వెళ్లడానికి సంకోచిస్తారు. అందరూ తమనే చూస్తున్నారనే భావన వెంటాడుతుంది. అయితే దీన్ని సైకాలజీలో ‘స్పాట్‌లైట్ ఎఫెక్ట్’ అంటారు. నిజానికి ఇతరులు మనపై అంతగా దృష్టి పెట్టరు. వాళ్లు తమ పనులు, స్నేహితులు, ఫోన్లతోనే బిజీగా ఉంటారు. ఈ విషయాన్ని అర్థం చేసుకున్నాక ఒంటరిగా బయటకు వెళ్లడంపై ఉన్న సంకోచం చాలా వరకు తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
మనసుకు నచ్చినట్టే..
ఒంటరిగా భోజనం చేయడంలో మరో సౌలభ్యం కూడా ఉంది. ఏ రెస్టారెంట్‌కు వెళ్లాలి? ఏం తినాలి? ఎంతసేపు ఉండాలి? అన్న విషయాల్లో ఎవరికీ తగ్గాల్సిన అవసరం ఉండదు. మనకు నచ్చిన ఆహారం ఆర్డర్ చేసుకోవచ్చు. పుస్తకం చదువుకుంటూ భోజనం చేయొచ్చు. డెజర్ట్ కావాలనిపిస్తే తీసుకోవచ్చు. త్వరగా వెళ్లాలనిపిస్తే లేచి రావచ్చు. ఈ స్వేచ్ఛను ఆస్వాదించే వాళ్లు తమతో తాము సంతోషంగా గడపగలరని నిపుణులు చెబుతున్నారు.
అయితే ప్రతిసారీ ఇదే అర్థం అనుకోవద్దు
అయితే ఒక్కరే భోజనం చేస్తున్న ప్రతి వ్యక్తీ ఏకాంతాన్ని ఆస్వాదిస్తున్నాడని అనుకోవద్దని సైకాలజిస్టులు చెబుతున్నారు. కొందరు తమ ఇష్టంతో ఒంటరిగా ఉంటే మరికొందరు ఒంటరితనం లేదా సామాజిక ఆందోళన వల్ల అలా ఉండొచ్చు. కాబట్టి వ్యక్తి ఒంటరిగా ఉన్నాడన్నది కాదు.. దాని వెనక కారణం ఏంటన్నదే ముఖ్యమని వారు చెబుతున్నారు. ప్రస్తుతం రిమోట్ వర్క్, మారుతున్న జీవనశైలి, సెల్ఫ్‌కేర్‌పై పెరుగుతున్న ఆసక్తితో ఒంటరిగా కేఫేలు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లకు వెళ్లే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది.