స్నేహితుల పుట్టినరోజును గుర్తుచేసేలా వాట్సాప్‌లో త్వరలో కొత్త ఫీచర్!
- బర్త్‌డే రిమైండర్ ఫీచర్‌పై పనిచేస్తున్న వాట్సాప్
- ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.26.27.3లో గుర్తింపు
- పుట్టినరోజు నాడు ప్రత్యేక నోటిఫికేషన్ పంపే అవకాశం
- వాట్సాప్‌లో యూజర్ల పుట్టిన తేదీ వివరాలు ఉంటేనే ఫీచర్ పనిచేస్తుంది
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో ఉపయోగకరమైన ఫీచర్‌ను తీసుకురానుంది. ఇకపై స్నేహితులు, కుటుంబ సభ్యుల పుట్టినరోజులు గుర్తుంచుకోవడానికి ప్రత్యేకంగా క్యాలెండర్ లేదా రిమైండర్ యాప్‌ల అవసరం లేకుండా.. వాట్సాప్‌లోనే బర్త్‌డే రిమైండర్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురావాలని సంస్థ యోచిస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ అభివృద్ధి దశలో ఉందని సమాచారం.
‘వాబీటాఇన్ఫో’ వివరాల ప్రకారం.. ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.26.27.3లో ఈ ఫీచర్‌కు సంబంధించిన వివరాలు గుర్తించారు. ఇందులో సేవ్ చేసిన కాంటాక్ట్‌ల పుట్టినరోజులను ఒకే చోట చూపించే ‘బర్త్‌డేస్’ అనే ప్రత్యేక సెక్షన్‌ను వాట్సాప్ తీసుకురానుంది. దీంతో త్వరలో ఎవరి పుట్టినరోజు ఉందో యాప్‌లోనే సులభంగా తెలుసుకోవచ్చు.
ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత.. కాంటాక్ట్ పుట్టినరోజు నాడు వాట్సాప్ యాప్‌లోనే ప్రత్యేక నోటిఫికేషన్ పంపే అవకాశం ఉంది. ఆ నోటిఫికేషన్‌పై ట్యాప్ చేసి నేరుగా ఆ వ్యక్తి చాట్‌లోకి వెళ్లి వెంటనే శుభాకాంక్షలు పంపించవచ్చు.
ఈ ఫీచర్ పనిచేయాలంటే వాట్సాప్‌లో యూజర్ల పుట్టిన తేదీ వివరాలు ఉండాలి. ప్రస్తుతం అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో వయస్సు ధ్రువీకరణ నిబంధనల కారణంగా యూజర్ల నుంచి ఈ వివరాలను సేకరిస్తోంది. అయితే ఇతర దేశాల్లో లేదా ప్రాంతాల్లో పుట్టిన తేదీ నమోదు తప్పనిసరి కాకపోవడంతో.. యూజర్లు స్వచ్ఛందంగా తమ పుట్టిన తేదీని నమోదు చేస్తేనే ఈ ఫీచర్ ఉపయోగపడే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఈ ఫీచర్‌లో పుట్టిన తేదీని ఎవరికి చూపించాలి? ఎవరికి చూపించకూడదు? వంటి ప్రైవసీ నియంత్రణలు అందుబాటులో లేవు. అయితే ఫీచర్ ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నందున.. అధికారికంగా విడుదల చేసే సమయానికి ప్రైవసీ ఆప్షన్‌లను కూడా చేర్చే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.
ఈ బర్త్‌డే రిమైండర్ ఫీచర్‌పై మెటా లేదా వాట్సాప్ ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం ఇది ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో అభివృద్ధి దశలో ఉండగా.. స్టేబుల్ వెర్షన్‌లో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయంపై ఇంకా స్పష్టత లేదు.