చీరకట్టులో బామ్మ జిమ్.. భద్రతపై కొత్త చర్చకు దారితీసిన వైరల్ వీడియో!
- బెంగళూరు పార్కులో వృద్ధురాలు వ్యాయామం చేస్తున్న వీడియో వైరల్
- ఆరుబయట జిమ్ పరికరాల భద్రతపై మొదలైన కొత్త చర్చ
- భద్రతా సూచనల బోర్డులు ఏర్పాటు చేయాలని బీబీఎంపీకి నెటిజన్ల డిమాండ్
బెంగళూరులోని ఓ పార్కులో చీరకట్టులో ఉన్న వృద్ధురాలు ఓపెన్ జిమ్ పరికరంతో తీవ్రంగా వ్యాయామం చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనతో పబ్లిక్ పార్కుల్లోని వ్యాయామ పరికరాల వద్ద భద్రతా మార్గదర్శకాలు ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఊపందుకుంది.
సుమారు 10 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో ఓ వృద్ధురాలు ఎయిర్ స్వింగ్ మెషీన్‌ను అత్యంత వేగంగా అటూ ఇటూ ఊపుతూ వ్యాయామం చేయడం కనిపిస్తుంది. ఆమె చుట్టూ వున్న పిల్లలు సహా పలువురు దీనిని ఆసక్తిగా గమనిస్తున్నారు. బెంగళూరుకు చెందిన సందీప్ పర్సనాథ్ అనే 'ఎక్స్' యూజర్ ఈ వీడియోను పంచుకున్నారు.
"పర్యవేక్షణ లేకుండా ఇలాంటి పరికరాలను ఉపయోగించడం ప్రమాదకరం కాదా? ఏదైనా అనుకోనిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ) ప్రతి ఓపెన్ జిమ్ పరికరం పక్కన స్పష్టమైన వినియోగ మార్గదర్శకాలు, భద్రతా సూచనల బోర్డులను ఏర్పాటు చేయాలి" అని ఆయన తన పోస్టులో డిమాండ్ చేశారు. ముఖ్యంగా వృద్ధులు ఇలాంటి పరికరాలను పర్యవేక్షణ లేకుండా వాడటం ప్రమాదకరమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ వీడియో వైరల్ కావడంతో ఆరుబయట జిమ్‌ల భద్రతపై నెటిజన్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు నెటిజన్లు బీబీఎంపీ వెంటనే భద్రతా సూచనలు ఏర్పాటు చేయాలని కోరుతుండగా, మరికొందరు ఎన్ని బోర్డులు పెట్టినా 'కామన్ సెన్స్'కు ప్రత్యామ్నాయం లేదని, వినియోగించే వారే జాగ్రత్తగా ఉండాలని వాదిస్తున్నారు.