మ్యాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో అంగరంగ వైభవంగా టేలర్ స్విఫ్ట్ వివాహం
- టేలర్ స్విఫ్ట్, ట్రావిస్ కెల్స్ వివాహం
- న్యూయార్క్‌లో అంగరంగ వైభవంగా వేడుక
- మ్యాడిసన్ స్క్వేర్‌లో భారీ స్క్రీన్లపై ప్రకటన
- మూడు సంవత్సరాల ప్రేమాయణానికి శుభం కార్డు
అంతర్జాతీయ పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్, ఎన్‌ఎఫ్ఎల్ స్టార్ ప్లేయర్ ట్రావిస్ కెల్స్ వివాహ బంధంతో ఒకటయ్యారు. గత మూడేళ్లుగా సాగుతున్న వీరి ప్రేమాయణానికి జూలై 4న న్యూయార్క్‌లో జరిగిన ఒక ప్రైవేట్ వివాహ వేడుకతో శుభం కార్డు పడింది. ఈ వివాహ సమాచారాన్ని టేలర్ స్విఫ్ట్ పబ్లిసిస్ట్ అధికారికంగా ధ్రువీకరించారు. మ్యాన్‌హాటన్‌లోని ప్రసిద్ధ క్రీడా వేదిక 'మ్యాడిసన్ స్క్వేర్ గార్డెన్' వెలుపల ఉన్న భారీ స్క్రీన్లపై "జస్ట్ మ్యారీడ్" అంటూ పెద్ద అక్షరాలతో ప్రదర్శించగా, ఆ వెంటనే రాయిటర్స్ వార్తా సంస్థకు పంపిన ఈమెయిల్ ద్వారా ఈ గ్రామీ అవార్డు గ్రహీత, కాన్సాస్ సిటీ చీఫ్స్ స్టార్ ప్లేయర్ వివాహం చేసుకున్నట్లు స్పష్టత ఇచ్చారు.
ఈ అద్భుతమైన వివాహ వేడుకకు హాలీవుడ్, సంగీత ప్రపంచానికి చెందిన పలువురు ప్రముఖులతో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు. హాలీవుడ్ ప్రముఖ కమెడియన్ ఆడమ్ శాండ్లర్ ఈ పెళ్లి వేడుకను దగ్గరుండి నడిపించినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు ముందే, స్విఫ్ట్ స్వస్థలమైన నాష్‌విల్లేలో అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరు రహస్యంగా వివాహం చేసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. తమ పెళ్లి సందర్భంగా ఈ జంట అమెరికా వ్యాప్తంగా ఉన్న 20 స్థానిక, జాతీయ స్వచ్ఛంద సంస్థలకు భారీగా విరాళాలు అందజేసి తమ ఉదారతను చాటుకున్నారు.
2023లో స్నేహంతో ప్రారంభమైన వీరి ప్రయాణం ఆ తర్వాత ప్రేమగా మారింది. 2025 ఆగస్టు 26న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తాము నిశ్చితార్థం చేసుకున్నట్లు ఈ జంట ప్రకటించింది. 14 సార్లు గ్రామీ అవార్డులు గెలుచుకున్న టేలర్ స్విఫ్ట్, మూడు సార్లు సూపర్ బౌల్ ఛాంపియన్‌గా నిలిచిన ట్రావిస్ కెల్స్‌ల వివాహంతో వీరి అభిమానుల కల నిజమైంది.