- జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించి జైలుకు పంపిస్తామన్న రాహుల్
- ‘ఆయన తర్వాత మీ వంతే’ అంటూ ప్రధానికి హెచ్చరిక
- 2024 ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని ఆరోపణ
- 15 శాతం ఓటర్ల పేర్లు తొలగించారని వ్యాఖ్య
- దేశ సంపద కొంత మంది చేతుల్లోనే ఉందని విమర్శ
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌పై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయనను పదవి నుంచి తొలగించి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. ఆ తర్వాత తమ పోరాటం ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఉంటుందని పేర్కొన్నారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఇండియా కూటమి నిర్వహించిన భారీ ర్యాలీలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘జ్ఞానేశ్ కుమార్ తర్వాత మీ వంతే మోదీజీ’’ అంటూ ప్రధానిని ఉద్దేశించి హెచ్చరించారు. జ్ఞానేశ్ కుమార్ లేకపోతే మోదీ ప్రధాని, అమిత్ షా హోంమంత్రి అయ్యేవారు కాదని వ్యాఖ్యానించారు. దేశంలో ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసేందుకు ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపు, చేర్పులు చేస్తున్నారని ఆరోపించారు. ఈవీఎంల ద్వారా కూడా ఓట్ల చోరీకి పాల్పడుతున్నారని విమర్శించారు. మధ్యప్రదేశ్, హర్యానా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ అక్రమాలు జరిగాయని ఆరోపించారు.
2024 ఎన్నికల తర్వాత దేశంలోని 15 శాతం మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించారని రాహుల్ పేర్కొన్నారు. ఆ ఎన్నికలు చట్టవిరుద్ధంగా జరిగాయని, ప్రజల తీర్పును దొంగిలించారని ఆరోపించారు. ఓటర్ల పేర్ల తొలగింపు దేశద్రోహంతో సమానమని, ఇది అత్యంత తీవ్రమైన కేసుల్లో ఒకటని అభివర్ణించారు. ఈ ఆరోపణలకు ఎన్నికల సంఘం వెల్లడించిన గణాంకాలే ఆధారమని చెప్పారు.
దేశ సంపద కొంత మంది చేతుల్లోనే కేంద్రీకృతమవుతోందని రాహుల్ విమర్శించారు. రైతులు కష్టపడి పండించిన పంటకు తగిన ప్రతిఫలం దక్కాలని, చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు రావాలని అన్నారు. యువత, మహిళలు, కార్మికులు, రైతులకు హక్కులు దక్కడం లేదని ఆరోపించారు. దేశం ఇద్దరు ముగ్గురు సంపన్నుల సొత్తు కాదని, ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు ఉండాలని స్పష్టం చేశారు.
అందరూ స్వేచ్ఛగా జీవిస్తూ, తమ కష్టానికి తగిన ఫలితం పొందే భారతదేశం కావాలని ఆకాంక్షించారు. తనకు మతం కంటే ప్రతి భారతీయుడి గొంతుకే ముఖ్యమని చెప్పారు. మోదీ, అమిత్ షా, జ్ఞానేశ్ కుమార్‌లపై తనకు వ్యక్తిగత ద్వేషం లేదని, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలపై దాడులు చేయబోమని అన్నారు. ప్రేమ, అహింస మార్గంలోనే పోరాడతామని, అయితే రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడానికి మాత్రం అనుమతించబోమని హెచ్చరించారు.
ఈ ఆందోళన ఏ ఒక్క పార్టీ కోసం కాదని, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ కోసమని ఇండియా కూటమి నేతలు చెబుతున్నారు. మరోవైపు, ఎన్నికల సంఘం మాత్రం ఓటర్ల జాబితా సవరణలో అనర్హులు, మరణించినవారు, వేరే ప్రాంతాలకు వెళ్లిపోయినవారు, నకిలీ పేర్లను గుర్తించి తొలగిస్తున్నామని వివరిస్తోంది. సవరణలో గుర్తించిన 13.39 కోట్ల పేర్లన్నీ అర్హులైన ఓటర్ల తొలగింపుగా భావించరాదని స్పష్టం చేసింది. పేర్లు తొలగించిన, అర్హులైన ఓటర్లు నిబంధనల ప్రకారం మళ్లీ నమోదు చేసుకోవచ్చని తెలిపింది.