UPI హిస్టరీ మీ ఖర్చుల అసలు కథ చెబుతుంది.. ఇలా చెక్ చేయండి

UPI history reveals your spending habits and how to check
  • యూపీఐ హిస్టరీతో ఖర్చుల అలవాట్లు తెలుసుకోవచ్చు
  • గత 30 రోజుల చెల్లింపులను పరిశీలించాలని సూచన
  • ఒకే చోట పదేపదే చేసిన ఖర్చులపై దృష్టి పెట్టాలి
  • ఖర్చులను విభాగాలుగా వర్గీకరించాలి
  • చిన్న మార్పులతోనే ఎక్కువ పొదుపు సాధ్యం
రోజూ కూరగాయలు కొనడం నుంచి కాఫీ తాగడం, ఫుడ్ ఆర్డర్ చేయడం, క్యాబ్ బుక్ చేసుకోవడం వరకు దాదాపు ప్రతి చెల్లింపూ ఇప్పుడు యూపీఐ ద్వారానే జరుగుతోంది. అయితే నెలాఖరులో డబ్బు ఎక్కడ ఖర్చైందో అర్థం కాక ఇబ్బంది పడేవారు చాలామందే. ఆర్థిక నిపుణులు మాత్రం మీ యూపీఐ హిస్టరీనే మీ ఖర్చుల అద్దమని చెబుతున్నారు.

ముందుగా గత 30 రోజుల యూపీఐ హిస్టరీని పరిశీలించాలని సూచిస్తున్నారు. ఎంత మొత్తం ఖర్చు చేశారనేది కాకుండా.. ఏ షాప్‌, ఏ యాప్‌, ఏ సేవకు ఎక్కువసార్లు చెల్లింపులు చేశారో గమనించాలని చెబుతున్నారు. ఒక్కోసారి రూ.200, రూ.300 పెద్దగా అనిపించకపోయినా.. అదే ఖర్చు పదేపదే చేస్తే నెలాఖరుకు వేల రూపాయలు అవుతాయని గుర్తు చేస్తున్నారు.

వారాంతాల్లో చేసే ఖర్చులను కూడా ఒకసారి పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఒత్తిడి, బోర్‌, ఆనందం వంటి భావోద్వేగాల కారణంగా అనవసరంగా షాపింగ్‌ లేదా ఫుడ్ ఆర్డర్లు చేస్తున్నామా అనేది కూడా గుర్తించాలన్నారు. అవసరాలు, జీవనశైలి ఖర్చులు, హఠాత్తుగా చేసే ఖర్చులు అనే మూడు విభాగాలుగా ఖర్చులను విభజిస్తే ఎక్కడ డబ్బు ఆదా చేయవచ్చో సులభంగా అర్థమవుతుందని చెబుతున్నారు.

ఖర్చులను పూర్తిగా ఆపేయాలని కాకుండా.. ప్రతి నెల మూడు అనవసర చెల్లింపులను తగ్గించే లక్ష్యం పెట్టుకుంటే సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. చిన్న చిన్న మార్పులే దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో పొదుపుకు దోహదపడతాయని పేర్కొంటున్నారు.
UPI
UPI Payment History
Financial Planning
Money Saving Tips
Digital Payments
Budgeting Strategies

More Telugu News