ఉద్యోగులకు అలర్ట్.. ఈపీఎఫ్‌ఓ సేవలు 4 రోజులు బంద్!
- జూన్ 26 నుంచి 29 వరకు ఈపీఎఫ్‌వో ఆన్‌లైన్ సేవలు నిలిపివేత
- సిస్టమ్ మైగ్రేషన్, అప్‌గ్రేడ్ పనుల కోసం నిర్ణయం
- పీఎఫ్ క్లెయిమ్‌లు, ఈ-పాస్‌బుక్ సేవలు అందుబాటులో ఉండవు
- ఈసీఆర్ ఫైలింగ్, యూఏఎన్ లింకింగ్ కూడా తాత్కాలికంగా నిలిపివేత
- జూన్ 30 నుంచి సేవలు పునరుద్ధరణకు అవకాశం
జూన్ 26 నుంచి 29 వరకు ఈ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ కాలంలో పీఎఫ్ క్లెయిమ్‌లు దాఖలు చేయడం, క్లెయిమ్ ప్రాసెసింగ్, ఈ-పాస్‌బుక్ వీక్షించడం, కొత్త ఉద్యోగుల యూఏఎన్ లింకింగ్, ఈసీఆర్ ఫైలింగ్ వంటి సేవలు అందుబాటులో ఉండవు. సాంకేతిక మార్పుల ద్వారా మరింత వేగవంతమైన, సురక్షితమైన సేవలు అందించడమే దీని ఉద్దేశమని ఈపీఎఫ్‌వో తెలిపింది.
సేవలు జూన్ 30 నుంచి తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. అయితే ఉమంగ్ యాప్‌లో కనిపిస్తున్న సమాచారం ప్రకారం కొన్ని సేవలు జులై 2 వరకు అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో సభ్యులు, యజమానులు తమ అవసరాలను ముందుగానే పూర్తి చేసుకోవాలని సూచించింది. ఏవైనా ఇబ్బందులు ఎదురైతే ఈపీఎఫ్‌వో హెల్ప్‌లైన్ 14470ను సంప్రదించాలని సంస్థ సూచించింది.