పసిడి ప్రియులకు శుభవార్త.. వరుసగా మూడో రోజూ తగ్గిన ధరలు

Gold price falls for third consecutive day good news for buyers
  • వరుసగా మూడో రోజు తగ్గిన బంగారం, వెండి ధరలు
  • హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,590 లు
  • కిలో వెండి ధరలో రూ.5,000 వరకు తగ్గుదల
వరుసగా మూడో రోజు కూడా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బుధవారం పసిడి, వెండి ధరలు క్షీణించాయి. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది కొంత ఊరటనిచ్చే అంశంగా మారింది.

హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర సుమారు రూ.1,44,590గా ఉండగా, 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,32,540 వద్ద నిలిచింది. మంగళవారంతో పోలిస్తే తులం బంగారంపై దాదాపు రూ.2,000 మేర తగ్గింది. ఇక వెండి ధరలోనూ భారీ తగ్గుదల కనిపించింది. మంగళవారంతో పోలిస్తే కిలో వెండిపై ఏకంగా రూ.5,000 వరకు తగ్గి, ప్రస్తుతం రూ.2,49,900 వద్ద ట్రేడ్ అవుతోంది.

దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,44,740గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని వరంగల్, నిజామాబాద్, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి వంటి నగరాల్లో కూడా ఇదే తరహా తగ్గుదల నమోదైంది.                                
Go Back to Shorts
Gold Price
Silver Price
Hyderabad Gold Rate
Vijayawada Gold Rate
Gold Price Drop India
24 Carat Gold Rate

More Telugu News