తమిళ రాజకీయాల్లో తెలుగు వ్యక్తి.. విజయ్ వెనుక ఉన్న విష్ణురెడ్డి ఎవరు?
- విజయ్ వెంట కనిపించి చర్చనీయాంశమైన విష్ణురెడ్డి
- ఆయన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి సమీప బంధువు
- కలికిరి మండలానికి చెందిన విష్ణురెడ్డికి చెన్నైలో గ్రానైట్ వ్యాపారి
- విజయ్ పార్టీ 'టీవీకే'కు కీలక వ్యూహకర్తగా ఉన్నారని ప్రచారం
- గవర్నర్‌తో భేటీలోనూ విజయ్ వెంటే ఉండటంతో పెరిగిన ప్రాధాన్యం
తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం ఒక తెలుగు వ్యక్తి పేరు బలంగా వినిపిస్తోంది. తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత, ముఖ్యమంత్రి విజయ్‌కు అత్యంత సన్నిహితుడిగా, కీలక వ్యూహకర్తగా ఉన్న ఆ వ్యక్తి పేరు విష్ణురెడ్డి. ఇటీవల ప్రభుత్వ ఏర్పాటు విషయమై విజయ్ గవర్నర్‌ను కలిసినప్పటి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈయన గురించి తీవ్ర చర్చ జరుగుతోంది. ఆ ఫొటోలో విజయ్ పక్కనే ఉన్న విష్ణురెడ్డి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి స్వయానా బావమరిది కావడం విశేషం.
విష్ణురెడ్డి పూర్తి పేరు ఎర్రదొడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి. ఆయన స్వస్థలం అన్నమయ్య జిల్లా కలికిరి మండలం ఎర్రదొడ్డిపల్లె. గత పదిహేనేళ్లుగా చెన్నైలో నివాసం ఉంటూ గ్రానైట్ వ్యాపారం చేస్తున్నారు. ఆయన తండ్రి రామనారాయణరెడ్డి గతంలో కలికిరి మండలంలో సర్పంచ్‌గా, వైస్ ఎంపీపీగా ప్రజాప్రతినిధిగా సేవలు అందించారు. విష్ణురెడ్డి తల్లి, కలికిరి మాజీ ఎంపీపీ నల్లారి ఆనంద రెడ్డికి సోదరి. ఈ బంధుత్వం రీత్యా ఆయన కిరణ్ కుమార్‌రెడ్డి, కిశోర్ కుమార్‌రెడ్డి కుటుంబానికి అత్యంత సమీప బంధువు అవుతారు.
కొన్నేళ్లుగా విజయ్‌తో విష్ణురెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఆయన స్థాపించిన టీవీకే పార్టీలో కీలక వ్యూహకర్తగా, ఆర్థిక వ్యవహారాల్లో సహాయకుడిగా వ్యవహరిస్తున్నారని తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. విజయ్ సినిమాల పర్యవేక్షణలో కూడా ఆయన పాత్ర ఉందని చెబుతున్నారు. అత్యంత కీలకమైన గవర్నర్ భేటీలో విజయ్ వెంట విష్ణు రెడ్డి ఉండటం ఆయన ప్రాధాన్యతను తెలియజేస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.