అందుకే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బయటకు వచ్చాం: రాఘవ్ చద్దా
- కేజ్రీవాల్ విధానాల కారణంగానే బయటకు వచ్చామన్న రాఘవ్ చద్దా
- ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుతం సరైన మార్గంలో వెళ్లడం లేదని వ్యాఖ్య
- పార్టీ కోసం కష్టపడిన వారు వీడాల్సి వస్తోందన్న రాఘవ్ చద్దా
మరికొందరు నాయకులు కూడా పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీలో ఉండటానికి చాలామందికి ఇష్టం లేదని అన్నారు. నిరాశ, నిస్పృహ, అసహ్యం వల్లే బయటకు వచ్చామని అన్నారు. అద్దాల మేడ కారణంగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిష్ఠ దెబ్బతిన్నదని అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి ప్రధాన కారణం అదేనని తెలిపారు. అవినీతిపరులు, రాజీపడని వారి చేతుల్లోకి పార్టీ వెళ్లిపోయిందని ఆరోపించారు. కష్టపడి పనిచేసేవారికి పార్టీలో అవకాశాలు లేకుండా పోయాయని వాపోయారు.