భారత్, చైనాలను నరకంతో పోల్చిన ట్రంప్.. కౌంటర్ ఇచ్చిన హైదరాబాద్ ఇరాన్ ఎంబసీ

భారత్, చైనాలను నరకంతో పోల్చిన ట్రంప్.. కౌంటర్ ఇచ్చిన హైదరాబాద్ ఇరాన్ ఎంబసీ

China and India are the cradles of Civilization
  • భారత్, చైనా దేశాలు నాగరికతలకు పుట్టినిల్లు అన్న హైదరాబాద్‌లోని ఇరాన్ ఎంబసీ
  • ఇరాన్ నాగరికతను నాశనం చేస్తానన్న ట్రంప్ దేశమే అసలైన నరకమని వ్యాఖ్య
  • ట్రంప్ నియమం లేకుండా విభజిస్తున్నారని విమర్శ
భారత్, చైనా దేశాలను నరకకూపాలతో పోలుస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్‌లోని ఇరాన్ కాన్సులేట్ స్పందించింది. భారతదేశం, చైనాలు నాగరికతలకు పుట్టినిల్లు వంటివి అని పేర్కొంది. వాస్తవానికి, ఇరాన్ నాగరికతను నాశనం చేస్తానని ఏ యుద్ధ నేరస్థుడైన అధ్యక్షుడు (ట్రంప్) బెదిరింపులకు పాల్పడుతున్నాడో అక్కడే (అమెరికా) నరకం ఉందని ఇరాన్ కాన్సులేట్ 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేసింది.

ట్రంప్‌ను ఉద్దేశిస్తూ హైదరాబాద్‌లోని ఇరాన్ కాన్సులేట్ వరుస ట్వీట్లు చేసింది. విభజించి, పాలించు అనే సూత్రం ఉందని, కానీ ట్రంప్ మాత్రం ఎలాంటి పద్ధతి లేకుండా విభజిస్తున్నారని ఆరోపిస్తూ మరో ట్వీట్ చేసింది. డొనాల్డ్ ట్రంప్ నిత్యం ఏదో ఒక పోస్టుతో తనలోని అంతులేని అమానవీయతను రుజువు చేస్తున్నారని, ఇది అసలైన జాత్యాహంకారం అని మరో ట్వీట్‌లో విమర్శించింది.
Advertisement
China and India are the cradles of Civilization
Iran In Hyderabad
Consulate General of the Islamic Republic of Iran

More Telugu News