చెన్నై సిటీలో హోరెత్తిన చంద్రబాబు రోడ్ షో
- తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- చెన్నైలోని అన్నానగర్ లో చంద్రబాబు రోడ్ షో
- ఘన స్వాగతం పలికిన కూటమి నేతలు, అభిమానులు
- ఎన్డీయే కూటమి అభ్యర్ధులను గెలిపించాలని ప్రజలకు పిలుపు
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా చంద్రబాబు చెన్నైకి విచ్చేశారు. ముఖ్యంగా తెలుగు ప్రజలు అధికంగా నివసించే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు. చంద్రబాబు రోడ్ షోలో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొనడంతో సందడిగా మారింది.
టీడీపీ, ఎన్డీయే కార్యకర్తలు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, బ్యానర్లుతో చంద్రబాబుకు స్వాగతం పలికారు.