- ప్రయాణికురాలితో గొడవలో గాయపడ్డ కండక్టర్ ప్రవళిక మృతి
- పది రోజులుగా హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత
- కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ
ప్రయాణికురాలితో జరిగిన ఘర్షణలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న టీఎస్ఆర్టీసీ మణుగూరు డిపో మహిళా కండక్టర్ గుండ్ల ప్రవళిక (24) మృతి చెందారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పది రోజులుగా చికిత్స పొందుతున్న ఆమె, నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ ఘటనపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ప్రవళిక మరణం తనను తీవ్రంగా కలచివేసిందని మంత్రి అన్నారు. "ప్రవళిక కోలుకుని తిరిగి వస్తుందని ఆశించాం. కానీ ఆమె మృతి చెందడం చాలా బాధాకరం. ఆమె కుటుంబానికి ప్రభుత్వం, ఆర్టీసీ అండగా ఉంటుంది. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం" అని ఆయన స్పష్టం చేశారు.
అక్టోబర్ 25న మణుగూరు నుంచి భద్రాచలం వెళ్తున్న బస్సులో టికెట్ విషయంలో ప్రయాణికురాలు బానోతు మౌనికతో ప్రవళికకు వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో అశ్వాపురం మండలం మిట్టగూడెం వద్ద ప్రయాణికురాలు... ప్రవళికను కదులుతున్న బస్సులోంచి బయటకు తోసేసింది. దీంతో బస్సు వెనుక చక్రాల కింద పడి ఆమె కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం ఆమెను హైదరాబాద్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు.
ప్రవళిక మృతికి నిరసనగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బుధవారం బస్సుల బంద్కు, రాష్ట్రవ్యాప్తంగా నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరు కావాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి.