15 ఏళ్లుగా అక్షయ్ కుమార్ సమోసాలకు ఎందుకు దూరంగా వుంటున్నారు?
- డైటింగ్ కోసం కాదని.. అసిడిటీ వస్తుందనే తిననని స్పష్టం చేసిన నటుడు
- 'జబ్ తక్ రహేగా సమోసే మే ఆలూ' పాట టైంలోనూ తినలేదని వ్యాఖ్య
- క్రమశిక్షణతో కూడిన జీవనశైలే తన ఫిట్‌నెస్‌కు కారణమని వెల్లడి
- రేపు 'భూత్ బంగ్లా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న అక్షయ్
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన ఆరోగ్యం, ఫిట్‌నెస్ విషయంలో ఎంత శ్రద్ధ తీసుకుంటారో అందరికీ తెలిసిందే. 60 ఏళ్లకు దగ్గరవుతున్నా ఇప్పటికీ ఆయన ఎంతో చురుగ్గా, ఆరోగ్యంగా కనిపిస్తుంటారు. అయితే, తన ఆహార నియమాల గురించి ఆయన తాజాగా ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. తాను హోస్ట్ చేస్తున్న 'వీల్ ఆఫ్ ఫార్చ్యూన్' అనే క్విజ్ షోలో ఈ విషయంపై మాట్లాడారు.
షోలో పాల్గొన్న విధి భరాని, రివాజ్ ఘిమిరే, నీలం రాజ్‌పుత్ అనే కంటెస్టెంట్లతో అక్షయ్ కుమార్ సరదాగా ముచ్చటించారు. ఈ క్రమంలో కంటెస్టెంట్ విధి "మీరు గత 15 ఏళ్లుగా సమోసాలు తినలేదని విన్నాను. అది నిజమేనా?" అని అడిగింది. దానికి అక్షయ్ కుమార్ ఎంతో తేలికగా "అవును, దానిలో తప్పేముంది?" అని బదులిచ్చారు. అంత రుచికరమైన సమోసాను తినకుండా ఎలా ఉండగలుగుతున్నారని ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
దీనికి అక్షయ్ కుమార్ వివరణ ఇస్తూ.. తాను సమోసా తినకపోవడానికి డైటింగ్ లేదా బరువు పెరగడం కారణం కాదని స్పష్టం చేశారు. కేవలం అసిడిటీ సమస్య వస్తుందనే దానికి దూరంగా ఉంటున్నానని తెలిపారు. సమోసా తిన్న తర్వాత వచ్చే అసౌకర్యం తనకు ఇష్టం ఉండదని చెప్పారు. ఈ సందర్భంగా ఒక పాత జ్ఞాపకాన్ని గుర్తుచేసుకుంటూ, "నా కెరీర్‌లో 'జబ్ తక్ రహేగా సమోసే మే ఆలూ' అనే పాట ఎంత పాప్యులర్ అయ్యిందో తెలిసిందే. ఆ పాట చిత్రీకరణ సమయంలో కూడా నేను ఒక్క సమోసా కూడా తినలేదు" అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు.
అక్షయ్ కుమార్ క్రమశిక్షణ కలిగిన జీవనశైలికి పెట్టింది పేరు. ఆయన ప్రతిరోజూ సూర్యోదయానికి ముందే నిద్రలేస్తారు, రాత్రి 7 గంటల లోపే భోజనం పూర్తి చేస్తారు. అంతేకాకుండా సినిమాల్లో ఎంతటి ప్రమాదకరమైన స్టంట్స్ అయినా డూప్ లేకుండా తనే స్వయంగా చేస్తుంటారు. ఈ ఆరోగ్యకరమైన అలవాట్లే తన ఫిట్‌నెస్‌కు కారణమని ఆయన పలు సందర్భాల్లో చెప్పారు.
ఇక సినిమాల విషయానికొస్తే, అక్షయ్ కుమార్ ప్రస్తుతం 'భూత్ బంగ్లా' అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయనతో పాటు రాజ్‌పాల్ యాదవ్, పరేష్ రావల్, టబు, వామికా గబ్బి, దివంగత నటుడు అస్రానీ వంటి ప్రముఖులు నటించారు. ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది.