ప్రధాన్ రాజీనామాను బీఆర్ఎస్ ఎందుకు డిమాండ్ చేయడం లేదు?: రేవంత్ రెడ్డి
- ఫిర్యాదు చేయాలని ముఖ్యమంత్రి డిమాండ్
- తప్పుడు ఫిర్యాదు అయితే లోపల వేయిస్తానని హెచ్చరిక
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు బీఆర్ఎస్ డిమాండ్ చేయడం లేదని విమర్శ
తనకు రెండు చోట్ల ఓట్లు ఉన్నాయంటూ వస్తున్న ఆరోపణలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. హైదరాబాద్‌లో మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడిన ఆయన, తనపై వస్తున్న ఆరోపణలపై దమ్ముంటే ఫిర్యాదు చేయాలని సవాల్ విసిరారు. ఒకవేళ అది తప్పుడు ఫిర్యాదు అని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తన ఓటు బదిలీ కోసం నిబంధనల ప్రకారం ఇప్పటికే కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. గతంలో జీహెచ్ఎంసీ పరిధిలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఓట్లను తొలగించారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, అప్పటి జీహెచ్ఎంసీ కమిషనర్‌పై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 70 శాతం ఓటర్ల జాబితా సవరణ పూర్తయిందని, ప్రక్షాళన నెపంతో ఓట్లు గల్లంతు కాకుండా ఉండేందుకు బీఎల్ఓలను నియమించినట్లు వివరించారు. ఓట్లు లేకపోతే ప్రజలకు ప్రభుత్వ పథకాలు ఎలా అందుతాయని ఆయన ప్రశ్నించారు.
హైడ్రా పనితీరుపై ముఖ్యమంత్రి ప్రశంసలు కురిపించారు. ఈ సంస్థ ఇప్పటికే అనేక అక్రమ ఆస్తులను స్వాధీనం చేసుకుందని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను పూర్తిగా గాలికొదిలేశారని విమర్శించారు. ఆ ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి కారణంగానే కేసీఆర్ గతంలో హరీశ్ రావును కొంతకాలం మంత్రి పదవికి దూరంగా ఉంచారని ఆరోపించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇంటర్‌మీడియట్ ఫలితాల వెల్లడిలో జరిగిన తప్పిదాల వల్ల 27 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గ్లోబరీనా సంస్థ వ్యవహారంలో కేటీఆర్ తన నిజాయతీని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల మరణాలకు కారణమైన కేటీఆర్, ఇప్పటికైనా బహిరంగ క్షమాపణ చెప్పాలని అన్నారు. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను బీఆర్ఎస్ ఎందుకు డిమాండ్ చేయడం లేదని ఆయన నిలదీశారు.