భూ మోసాలకు 'బ్లాక్‌చెయిన్'తో చెక్.. ట్యాంపర్ ప్రూఫ్ విధానానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు
- భూ రికార్డుల భద్రత కోసం బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ వినియోగం
- ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా 'మీ భూమి-బ్లాక్‌చెయిన్' పైలట్ ప్రాజెక్టు ప్రారంభం
- మొదటి దశలో 7 జిల్లాల్లోని 7 మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు
- భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యమన్న సీఎం
- నవంబర్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు సన్నాహాలు
ఆంధ్రప్రదేశ్‌లో భూ రికార్డుల నిర్వహణలో విప్లవాత్మక మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. భూ లావాదేవీల్లో పారదర్శకతను పెంచి, మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు రూపొందించిన 'మీ భూమి-బ్లాక్‌చెయిన్' పైలట్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం సచివాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. భూ రికార్డులకు శాశ్వత భద్రత కల్పించడమే లక్ష్యంగా రెవెన్యూ శాఖ ఈ అత్యాధునిక టెక్నాలజీకి రూపకల్పన చేసింది. ఈ విధానం ద్వారా డబుల్ రిజిస్ట్రేషన్ల వంటి సమస్యలకు శాశ్వతంగా చెక్ పెట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, సరైన రికార్డులు లేకపోవడం వల్లే విలువైన భూముల విషయంలో మోసాలు, వివాదాలు తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రంలో భూ తగాదాలు పెరిగాయని, 22ఏ నిబంధనను అడ్డుపెట్టుకుని కక్ష సాధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు.
తమ ప్రభుత్వం 'ప్రక్షాళన, విముక్తి, భద్రత' అనే మూడు సూత్రాల ఆధారంగా భూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోందన్నారు. శెట్టిపల్లి, వట్టిచెరుకూరు వంటి గ్రామాల్లో దశాబ్దాలుగా నలుగుతున్న భూ వివాదాలకు పరిష్కారం చూపిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పుడు ప్రారంభించిన బ్లాక్‌చెయిన్ వ్యవస్థ ద్వారా భూములకు ట్యాంపర్ ప్రూఫ్ భద్రత లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ ప్రాజెక్టును ఎన్‌ఐసీ ఆంధ్రప్రదేశ్, బెంగళూరులోని ఎన్‌ఐసీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ సంస్థలు సంయుక్తంగా 'హైపర్ లెడ్జర్ ఫ్యాబ్రిక్' టెక్నాలజీతో అభివృద్ధి చేశాయి. ఈ విధానంలో ప్రతి భూ కమతానికి ఒక ప్రత్యేక డిజిటల్ ఐడీని కేటాయించి, లావాదేవీలను అత్యంత భద్రంగా నమోదు చేస్తారు. దీనివల్ల రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖలు ఒకే వేదికపైకి వచ్చి, భూ రికార్డులకు 'సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్' వ్యవస్థ ఏర్పడుతుంది. దీంతో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్రయవిక్రయాలు జరుపుకోవచ్చు.
పైలట్ ప్రాజెక్టు కింద తొలి దశలో కర్నూలు, చిత్తూరు, బాపట్ల, కృష్ణా, తూర్పు గోదావరి, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లోని ఒక్కో మండలాన్ని ఎంపిక చేశారు. ఆస్పరి, పెనుమూరు, రేపల్లె, గన్నవరం, కడియం, గుమ్మలక్ష్మీపురం, కొత్తవలస మండలాల్లోని 89 రీ-సర్వే గ్రామాల్లో ఉన్న 1,37,763 ల్యాండ్ పార్సెల్స్ ఈ ప్రాజెక్టు పరిధిలోకి వస్తాయి.
ఈ పైలట్ ప్రాజెక్టు అమలును రెండు నెలల పాటు క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే సూచనలు, ఫిర్యాదుల కోసం ఒక ప్రత్యేక కంప్లైంట్ సెల్ ఏర్పాటు చేయాలన్నారు. ఆ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా వ్యవస్థలో మార్పులు చేసి, నవంబర్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా నిర్దేశించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖల ఉన్నతాధికారులు, వివిధ జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.