Bangalore Woman: రీల్స్ పిచ్చి పీక్: తండ్రినే బస్తాలో కుక్కి కొరియర్ చేయబోయిన కూతురు.. వీడియో ఇదిగో!
సోషల్ మీడియాలో వ్యూస్, లైకుల కోసం కొందరు ఎంతటి దారుణాలకైనా వెనుకాడటం లేదు. ఈ పిచ్చి పరాకాష్ఠకు చేరిన ఓ షాకింగ్ ఘటన బెంగళూరులో వెలుగుచూసింది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం ఓ మహిళ తన కన్నతండ్రినే గోనె సంచిలో కుక్కి, కొరియర్ ద్వారా పంపించేందుకు ప్రయత్నించి పోలీసులకు చిక్కింది.
బెంగళూరులోని హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా నివసించే ఓ మహిళ తన తండ్రిని పెద్ద బస్తాలో బంధించి, దాన్ని గట్టిగా కట్టేసింది. ఆ తర్వాత ఒక ప్రైవేట్ కొరియర్ సంస్థకు ఫోన్ చేసి, తన వద్ద ఓ భారీ పార్శిల్ ఉందని, డెలివరీ చేయాలని కోరింది. ఆమె ఇంటికి చేరుకున్న కొరియర్ సిబ్బంది, ఆ బస్తాను తరలించే క్రమంలో లోపల నుంచి కదలికలు రావడాన్ని గమనించారు.
అనుమానంతో వారు ఆ సంచిని విప్పి చూడగా, లోపల ఓ వృద్ధుడు ఊపిరాడక ఇబ్బంది పడుతూ కనిపించడంతో నిర్ఘాంతపోయారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మహిళను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో, వైరల్ రీల్ చేయడం కోసమే ఈ పని చేశానని ఆమె అంగీకరించింది.
పోలీసులు ఆ వృద్ధుడిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. నిందితురాలిపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.