Richard Illingworth: ఎల్లుండి జరిగే టీ20 వరల్డ్ కప్ ఫైనల్ కు అంపైర్లు వీరే!
- టీ20 ప్రపంచకప్ ఫైనల్ అంపైర్లుగా ఇల్లింగ్‌వర్త్, అలెక్స్ వార్ఫ్
- వరుసగా రెండోసారి టీ20 ఫైనల్‌లో బాధ్యతలు చేపట్టనున్న ఇల్లింగ్‌వర్త్
- తొలిసారి సీనియర్ వరల్డ్ కప్ ఫైనల్ అంపైర్‌గా అలెక్స్ వార్ఫ్
- మ్యాచ్ రిఫరీగా ఆండీ పైక్రాఫ్ట్, థర్డ్ అంపైర్‌గా అల్లావుద్దీన్ పాలేకర్
- హోమ్ గ్రౌండ్‌లో కప్పు కొట్టాలని సూర్యకుమార్ సేన పట్టుదల
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 తుది సమరానికి రంగం సిద్ధమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ ఆదివారం భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనున్న ప్రతిష్ఠాత్మక ఫైనల్ మ్యాచ్‌కు ఐసీసీ అంపైర్లను ఖరారు చేసింది. ఈ మెగా ఫైట్‌లో ఇంగ్లాండ్‌కు చెందిన రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, అలెక్స్ వార్ఫ్ ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనున్నారు.
రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్‌కు అంపైర్‌గా ఇది వరుసగా రెండో టీ20 ప్రపంచకప్ ఫైనల్ కావడం విశేషం. 2024లో బార్బడోస్ వేదికగా టీమిండియా విజేతగా నిలిచిన ఫైనల్ మ్యాచ్‌లోనూ క్రిస్ గఫానీతో కలిసి ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. అంతేకాకుండా 2023 వన్డే వరల్డ్ కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్‌లోనూ ఆయన అంపైర్‌గా వ్యవహరించారు. మరోవైపు ఇంగ్లాండ్ మాజీ పేసర్ అలెక్స్ వార్ఫ్‌కు సీనియర్ వరల్డ్ కప్ ఫైనల్‌లో అంపైరింగ్ చేయడం ఇదే తొలిసారి. కోల్‌కతాలో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ విజయం సాధించిన సెమీఫైనల్ మ్యాచ్‌లోనూ వీరిద్దరే అంపైర్లుగా ఉన్నారు.
ఈ ఫైనల్ మ్యాచ్‌కు మ్యాచ్ రిఫరీగా జింబాబ్వేకు చెందిన ఆండీ పైక్రాఫ్ట్, థర్డ్ అంపైర్‌గా దక్షిణాఫ్రికాకు చెందిన అల్లావుద్దీన్ పాలేకర్, ఫోర్త్ అంపైర్‌గా అడ్రియన్ హోల్డ్‌స్టాక్ వ్యవహరిస్తారు. పాలేకర్ ఈ టోర్నీలో ఇప్పటికే ఆరు మ్యాచ్‌లకు సేవలందించారు.
సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా వరుసగా రెండోసారి టైటిల్ గెలిచి, సొంతగడ్డపై కప్పు ఎత్తిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించాలని పట్టుదలతో ఉంది. మరోవైపు మిచెల్ సాంట్నర్ కెప్టెన్సీలోని కివీస్ జట్టు తమ తొలి టీ20 వరల్డ్ కప్ టైటిల్ కోసం తహతహలాడుతోంది. సెమీస్‌లో ఫిన్ అలెన్ కేవలం 33 బంతుల్లోనే రికార్డు సెంచరీతో చెలరేగడం ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. ఆదివారం జరగనున్న ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.