విశాఖ రైల్వేకు శుభవార్త.. రూ.299 కోట్లతో కొత్త లైన్లు, ప్లాట్‌ఫారాలు
- ఆరు కొత్త లైన్లు, ప్లాట్‌ఫారాల నిర్మాణం
- రైళ్ల ఆలస్యం, రద్దీ తగ్గించడమే లక్ష్యం
- తూర్పు వైపు కొత్త ప్రవేశ ద్వారం
- విశాఖ రైల్వే స్టేషన్ నుంచి రోజూ సుమారు 80 వేల మంది ప్రయాణం
విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో పెరుగుతున్న రద్దీకి చెక్ పడనుంది. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు రైళ్ల రాకపోకలను మరింత సులభతరం చేసేందుకు భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. రూ.299 కోట్లతో విశాఖ కోచింగ్ యార్డు ఆధునికీకరణకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుతో స్టేషన్ నిర్వహణ సామర్థ్యం పెరగడంతో పాటు రైళ్ల ఆలస్యం తగ్గే అవకాశం ఉంది.
దక్షిణ కోస్ట్ రైల్వే పరిధిలోని విశాఖపట్నం కోచింగ్ యార్డును పూర్తిగా పునర్వ్యవస్థీకరించనున్నారు. ఇందులో ఆరు కొత్త లైన్లు, అదనపు ప్లాట్‌ఫారాలు నిర్మించనున్నారు. ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ఉన్న ఆరు ప్లాట్‌ఫారాలను కూడా విస్తరించనున్నారు. దీంతో యార్డులో రద్దీ తగ్గి రైళ్ల కదలిక మరింత వేగంగా సాగనుంది.
ప్రస్తుతం విశాఖ రైల్వే స్టేషన్ నుంచి రోజూ సుమారు 80 వేల మంది ప్రయాణిస్తున్నారు. సగటున 113 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రస్తుత యార్డు నిర్మాణం కారణంగా టెర్మినేటింగ్ రైళ్లు, ఇతర రైళ్లు ఒకే మార్గాలను దాటాల్సి వస్తోంది. దీనివల్ల అప్రోచ్ సిగ్నళ్ల వద్ద రైళ్లు నిలిచిపోవడం, ప్లాట్‌ఫారాల లభ్యత తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి.
కొత్త ప్రాజెక్టు పూర్తైతే ఈ సమస్యలు గణనీయంగా తగ్గనున్నాయి. రైళ్ల నిలిపివేత సమయం తగ్గుతుంది. ప్లాట్‌ఫారాల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. భవిష్యత్తులో మరిన్ని రైళ్లను నిర్వహించే వీలుంటుంది. తూర్పు వైపు కొత్త ప్రవేశ ద్వారం నిర్మించడంతో పాటు ప్రయాణికుల రిజర్వేషన్ కేంద్రాన్ని కూడా కొత్త ప్రదేశానికి తరలించనున్నారు.