ఐటీఆర్ ఫైలింగ్‌కు రేపే ఆఖరు.. ఆలస్యమైతే రూ. 5,000 ఫైన్
- డిసెంబర్ 31 వరకు ఆలస్యంగా ఫైల్ చేసే అవకాశం
- ఇప్పటికే 5 కోట్లకు పైగా రిటర్న్స్ దాఖలు
- ఫైల్ చేశాక 60 రోజుల్లో ఈ-వెరిఫికేషన్ తప్పనిసరి
ఆదాయపు పన్ను రిటర్నుల (ఐటీఆర్) దాఖలుకు గడువు సమీపిస్తోంది. ఆడిట్ అవసరం లేని పన్ను చెల్లింపుదారులు 2026-27 అసెస్‌మెంట్ సంవత్సరానికి గాను జులై 31లోగా తమ రిటర్నులను సమర్పించాల్సి ఉంది. ఈ గడువు ముగియడానికి మరో ఒక్క రోజు మాత్రమే సమయం మిగిలి ఉంది. నిర్ణీత గడువులోగా ఐటీఆర్ దాఖలు చేయడంలో విఫలమైతే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
నిర్ణీత సమయంలోగా ఐటీఆర్ ఫైల్ చేయని వారు ఆలస్య రుసుము చెల్లించి, డిసెంబర్ 31, 2026 వరకు తమ రిటర్నులను సమర్పించవచ్చు. నిబంధనల ప్రకారం, వార్షిక ఆదాయం రూ. 5 లక్షల వరకు ఉన్నవారికి రూ. 1,000, అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారికి రూ. 5,000 వరకు జరిమానా విధిస్తారు. అయితే, ప్రాథమిక పన్ను మినహాయింపు పరిమితి కంటే తక్కువ ఆదాయం ఉన్నవారికి ఈ రుసుము వర్తించదు. కాకపోతే, చెల్లించాల్సిన పన్ను బకాయిలు ఏవైనా ఉంటే, వాటిపై వడ్డీ వర్తిస్తుంది.
ఆదాయపు పన్ను శాఖ గణాంకాల ప్రకారం, జులై 29 నాటికి 5.02 కోట్లకు పైగా రిటర్నులు దాఖలయ్యాయి. వీటిలో 4.69 కోట్లు వెరిఫై కాగా, 2.33 కోట్లు ఇప్పటికే ప్రాసెస్ అయ్యాయి. ఇటీవల ఒకే రోజులో దాదాపు 30 లక్షల రిటర్నులు సమర్పించడం గమనార్హం.
గడువులోగా రిటర్నులు దాఖలు చేయకపోతే రీఫండ్లు ఆలస్యమవడమే కాకుండా, కొన్ని రకాల నష్టాలను తర్వాతి సంవత్సరాలకు క్యారీ ఫార్వర్డ్ చేసుకునే వెసులుబాటును కోల్పోతారని పన్ను నిపుణులు సూచిస్తున్నారు. ఐటీఆర్ దాఖలు చేసిన 60 రోజుల్లోపు ఆధార్ ఓటీపీ, నెట్ బ్యాంకింగ్ లేదా డిజిటల్ సిగ్నేచర్ ద్వారా ఈ-వెరిఫికేషన్ పూర్తి చేస్తేనే ఆ రిటర్న్ చెల్లుబాటు అవుతుంది.