ఏడు గంటల పాటు బస్సులో ఏడుస్తూ.. నోయిడాలో ఓ బాలుడి దారుణ అనుభవం
- స్కూలు బస్సు ఎక్కాక వెనక సీట్లో నిద్రపోయిన బాలుడు
- గమనించని డ్రైవర్, స్కూలు సిబ్బంది
- 25 కి.మీ. దూరంలోని డిపోలో బస్సును పార్క్ చేసిన డ్రైవర్
- కొడుకును తీసుకెళ్లడానికి తల్లి స్కూలుకు రావడంతో బయటపడ్డ సిబ్బంది నిర్లక్ష్యం
స్కూలుకు వచ్చిన తల్లి..
మధ్యాహ్నం వేళ తన కుమారుడిని ఇంటికి తీసుకెళ్లడానికి తల్లి స్కూలుకు చేరుకోగా బాబు స్కూలుకే రాలేదని టీచర్లు చెప్పారు. అయితే, బస్సు రికార్డుల ప్రకారం బాలుడు ఉదయమే బస్సు ఎక్కినట్లు ఉండటంతో ఒక్కసారిగా భయాందోళనలు మొదలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు బస్సు కోసం వెతకగా.. పార్కింగ్ డిపోలో తాళం వేసి ఉన్న బస్సులో బాలుడు ఏడుస్తూ కనిపించాడు.
యాజమాన్యం వివరణ..
ఈ ఘటనపై పాఠశాల యాజమాన్యం స్పందిస్తూ.. సాంకేతిక కారణాల వల్ల చివరి నిమిషంలో బస్సును మార్చాల్సి వచ్చిందని, పాత బస్సులోనే బాబు ఉండిపోయాడని వివరణ ఇచ్చింది. బాలుడు క్షేమంగానే ఉన్నాడని, ఇలాంటివి పునరావృతం కాకుండా రవాణా నిబంధనలను కఠినతరం చేస్తామని పేర్కొంది. అయితే, సిబ్బంది యొక్క ఇంతటి భారీ నిర్లక్ష్యంపై బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడి కుటుంబం డిమాండ్ చేస్తోంది.