Afghanistan: టీ20 వరల్డ్ కప్: ఎట్టకేలకు గెలుపు బోణీ కొట్టిన ఆఫ్ఘనిస్థాన్

Afghanistan Wins Against UAE in T20 World Cup
  • టీ20 ప్రపంచకప్‌లో తొలి విజయం సాధించిన ఆఫ్ఘనిస్థాన్
  • యూఏఈపై 5 వికెట్ల తేడాతో గెలుపొందిన ఆఫ్ఘన్ జట్టు
  • ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో మెరిసిన అజ్మతుల్లా ఒమర్జాయ్
  • అర్ధశతకంతో రాణించిన ఇబ్రహీం జద్రాన్
  • యూఏఈ జట్టులో సోహైబ్ ఖాన్ ఒంటరి పోరాటం
టీ20 ప్రపంచకప్‌-2026లో వరుసగా రెండు ఓటములు చవిచూసిన ఆఫ్ఘనిస్థాన్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. సోమవారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన గ్రూప్-డి మ్యాచ్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) జట్టుపై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టోర్నీలో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ చేతిలో ఓడిన ఆఫ్ఘన్.. ఈ గెలుపుతో పాయింట్ల ఖాతా తెరిచింది.

యూఏఈ నిర్దేశించిన 161 పరుగుల లక్ష్యాన్ని ఆఫ్ఘనిస్థాన్ 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ (53) అర్ధశతకంతో రాణించగా, దర్విష్ రసూలీ (33) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో అజ్మతుల్లా ఒమర్జాయ్ (21 బంతుల్లో 40 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టుకు విజయాన్ని అందించాడు.

అంతకుముందు, టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్థాన్... యూఏఈని కట్టడి చేసింది. యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. సోహైబ్ ఖాన్ (68) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. ఆఫ్ఘన్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ కేవలం 15 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టి యూఏఈ పతనాన్ని శాసించాడు. ముజీబ్ ఉర్ రెహ్మాన్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఒమర్జాయ్ తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'‌గా నిలిచాడు.


Afghanistan
Afghanistan T20 World Cup
UAE
United Arab Emirates
Azmatullah Omarzai
Ibrahim Zadran
T20 World Cup 2026
Sohaib Khan
Mujeeb Ur Rahman
Arun Jaitley Stadium

More Telugu News