బడ్జెట్ లో క్యాన్సర్ బాధితులకు భారీ ఉపశమనం... ప్రాణరక్షక మందులకు పన్ను తగ్గింపు
- 17 రకాల మందులకు కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు
- ప్రాణ రక్షక మందులపై కేంద్రం ఊరట
- అరుదైన వ్యాధుల చికిత్సలో ఉపయోగించే మందులకూ వర్తింపు
ఈ ఔషధాలపై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ 0%కి తగ్గించినట్లు చెప్పారు. దీంతో పాటు అరుదైన వ్యాధుల చికిత్సలో ఉపయోగించే మందులు, ప్రత్యేక వైద్య ఆహారాల దిగుమతిపైనా పన్ను మినహాయిస్తున్నట్లు తెలిపారు. దీంతో క్యాన్సర్ చికిత్సకు అవసరమైన మందుల ధరలు తగ్గి, రోగులపై ఆర్థిక భారం తగ్గనుంది.