సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను చిప్స్ అడిగిన చిన్నారి... వీడియో ఇదిగో!

Yogi Adityanath Asked for Chips by Child
షార్ట్స్‌లో చూడండి
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఒక చిన్నారి బాలుడితో సరదాగా ముచ్చటించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. ఆ బాలుడు తనకు చిప్స్ కావాలని అడగగా, ముఖ్యమంత్రి చిరునవ్వుతో స్పందించారు. గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్ ఆలయంలో జరిగిన వార్షిక కిచిడీ మేళాలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సంప్రదాయం ప్రకారం గోరఖ్‌నాథునికి కిచిడీని సమర్పించారు. అనంతరం అక్కడకు విచ్చేసిన భక్తులతో ఆయన కాసేపు మాట్లాడారు.

ఆ సమయంలో, ఒక చిన్నారిని ఆయన దగ్గరకు పిలుచుకుని ఏం కావాలో అడిగారు. ఆ బాలుడు ముఖ్యమంత్రి చెవిలో తనకు చిప్స్ కావాలని చెప్పాడు. ఆ చిన్నారి మాటలకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో పాటు అక్కడున్న వారందరూ నవ్వారు.
Go Back to Shorts
Yogi Adityanath
Uttar Pradesh
UP CM
Gorakhnath Temple
Khichdi Mela
Chips
Viral Video

More Telugu News