- సింహాచలం ఆలయంలో కొత్త డ్రెస్ కోడ్ అమలు
- నిక్కర్లు, టీ షర్టులు ధరిస్తే ఆలయంలోకి అనుమతి లేదన్న ఈవో
- ఆలయ పవిత్రత కోసమే ఈ నిర్ణయమన్న ఈవో
- నరక చతుర్దశి రోజున సాయంత్రం 6 గంటల వరకే దర్శనం
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో భక్తులకు నూతన వస్త్ర నిబంధనలు (డ్రెస్‌కోడ్) అమల్లోకి వచ్చాయి. ఆలయానికి వచ్చే భక్తులు ఇకపై తప్పనిసరిగా సంప్రదాయ దుస్తుల్లోనే రావాలని దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈవో) జల్లేపల్లి వెంకట్రావు స్పష్టం చేశారు.
నూతన నిబంధనల ప్రకారం, పురుషులు పంచె-కండువా లేదా కుర్తా-పైజామా ధరించాలి. ఫార్మల్ ప్యాంట్, షర్ట్ ధరించిన వారిని కూడా అనుమతిస్తారు. మహిళలు చీర, లంగా- ఓణీ లేదా చుడీదార్‌తో పాటు తప్పనిసరిగా దుపట్టా ధరించాల్సి ఉంటుంది. షార్ట్స్ (నిక్కర్లు), టీ-షర్టులు, స్లీవ్‌లెస్ టాప్స్ వంటి ఆధునిక పాశ్చాత్య దుస్తులు ధరించిన వారిని ఆలయ ప్రాంగణంలోకి అనుమతించబోమని అధికారులు తేల్చిచెప్పారు. ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులకు సైతం ఈ నిబంధనలే వర్తిస్తాయని తెలిపారు.
ఆలయ పవిత్రతను కాపాడటంతో పాటు, సనాతన ధర్మ సంప్రదాయాలను పరిరక్షించే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈవో వెంకట్రావు వివరించారు. ఈ కొత్త నిబంధనలపై భక్తులకు అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు, నవంబర్ 8, ఆదివారం నరక చతుర్దశి, స్వాతి నక్షత్రం పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక హోమాలు జరగనున్నాయి. ఆ రోజున సాయంత్రం 6 గంటల వరకే భక్తులకు స్వామివారి దర్శన సౌకర్యం ఉంటుందని ఆలయ వర్గాలు వెల్లడించాయి.