జీ-20 కూటమి ఉనికి ప్రమాదంలో ఉంది: మేక్రాన్ సంచలన వ్యాఖ్యలు
- జోహన్నస్‌బర్గ్ వేదికగా జీ-20 సదస్సు
- కలిసికట్టుగా పోరాడటంలో కూటమి ఇబ్బంది పడుతోందన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు
- సమష్టిగా కృషి చేయకుంటే జీ-20 ప్రమాదంలో పడుతుందని హెచ్చరిక
ఈ సందర్భంగా మేక్రాన్ మాట్లాడుతూ, ప్రధాన సంక్షోభాలను పరిష్కరించేందుకు కలిసికట్టుగా పోరాడటంలో కూటమి ఇబ్బందులు పడుతోందని అన్నారు. ఉక్రెయిన్ ప్రజల సార్వభౌమత్వాన్ని గౌరవించకుండా అక్కడ శాంతి సాధ్యం కాదని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా జీ-20 సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరు కాకపోవడాన్ని ఆయన ప్రస్తావించారు.
కొన్ని ప్రాధాన్యాలపై సమష్టిగా కృషి చేయకుంటే జీ-20 ప్రమాదంలో పడుతుందని ఆయన హెచ్చరించారు. ఈ విషయాన్ని ప్రపంచ నేతలు గుర్తించాలని సూచించారు. గతంలో కూడా మేక్రాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధానికి ముందు, నాటో కూటమి బ్రెయిన్ డెడ్ అయిందంటూ వ్యాఖ్యానించారు.