Shilpa Shirodkar: పెళ్లి గురించి ఆసక్తికర అంశాలు వెల్లడించిన మహేశ్ బాబు వదిన!
- శిల్పా శిరోద్కర్, మహేశ బాబు అర్ధాంగి నమ్రత అక్కాచెల్లెళ్లు అని తెలిసిందే
- ప్రముఖ బ్యాంకర్ అపరేశ్ రంజిత్ ను పెళ్లాడిన శిల్పా
- తాను పదో తరగతి చదివానన్న శిల్పా
- అపరేశ్ డబుల్ ఎంబీఏ చేశాడని వెల్లడి
- విద్యాపరమైన వ్యత్యాసం తమ బంధాన్ని ప్రభావితం చేయలేదని వివరణ
తొంభైల నాటి బాలీవుడ్ అందాల తార శిల్పా శిరోద్కర్ తన వ్యక్తిగత జీవితం గురించి ఇటీవల ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. శిల్పా శిరోద్కర్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు వదిన అని తెలిసిందే. మహేశ్ అర్ధాంగి నమ్రతా శిరోద్కర్ కు శిల్పా స్వయంగా అక్క. ఆమె ప్రముఖ బ్యాంకర్ అపరేశ్ రంజిత్ ను వివాహం చేసుకున్నారు.
తాజాగా తన వైవాహిక జీవితంపై శిల్పా శిరోద్కర్ ఆసక్తికర అంశాలు వెల్లడించారు. తాను పదో తరగతి కూడా పాస్ కాలేదని, కానీ తన భర్త అపరేశ్ రంజిత్ మాత్రం డబుల్ ఎంబీఏ చేసిన బ్యాంకర్ అని ఆమె వెల్లడించారు. ఈ విద్యాపరమైన వ్యత్యాసం తమ బంధాన్ని ఏనాడూ ప్రభావితం చేయలేదని శిల్పా స్పష్టం చేశారు.
కెరీర్ పీక్‌లో విరామం
మిథున్ చక్రవర్తితో కలిసి 'భ్రష్టాచార్' సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన శిల్పా, కెరీర్ పీక్‌లో ఉండగానే నటనా వృత్తికి విరామం ఇచ్చారు. వివాహం అనంతరం తన భర్తతో కలిసి న్యూజిలాండ్‌లో స్థిరపడినట్లు ఆమె తెలిపారు. "నటనకు విరామం తీసుకున్నందుకు నేను ఏమాత్రం చింతించడం లేదు. నా భర్త చాలా మంచి వ్యక్తి. అతనితో నా జీవితాన్ని ప్రారంభించడం నాకు ముఖ్యం" అని శిల్పా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఒకవేళ భారతదేశంలోనే పెళ్లి చేసుకుని ఉంటే, వంద శాతం నటనను కొనసాగించేదాన్నని ఆమె చెప్పారు.
విద్యతో సంబంధం లేని బంధం
"నేను టెన్త్ ఫెయిల్. నా భర్త బ్యాంకర్, డబుల్ ఎంబీఏ. మేమిద్దరం చాలా భిన్నమైన వ్యక్తులం. కానీ అతనితో, అతని స్నేహితులతో నేను ఎలాంటి విషయాల గురించైనా మాట్లాడగలను. తక్కువ చదువుకున్నానని, అతని ముందు నేను ఎప్పుడూ చిన్నబుచ్చుకోలేదు" అని శిల్పా అన్నారు. తామిద్దరి మధ్య ఉన్న పరస్పర గౌరవం, అవగాహన తమ బంధానికి పునాది అని ఆమె స్పష్టం చేశారు.
ఒక్కరోజులోనే పెళ్లి నిర్ణయం
పెళ్లి, కాపురం... ఇలాంటి వాటి కోసం మొదట ముంబైని విడిచి వెళ్ళే ఉద్దేశ్యం లేకపోయినా, అపరేశ్‌ను కలిసిన తర్వాత శిల్పా మనసు మారిపోయింది. అతన్ని కలిసిన ఒకటిన్నర రోజుల్లోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. "అతని నిజాయతీ నాకు బాగా నచ్చింది. అప్పుడు నేను ఏం చేస్తున్నానో కూడా ఆలోచించలేదు. అంతా సజావుగా జరిగిపోయింది" అని ఆమె ఆ క్షణాన్ని గుర్తు చేసుకున్నారు.
ఇటీవల ఈ దంపతులు తమ 25వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. తన భర్తకు ప్రత్యేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ శిల్పా తన ప్రేమను, గౌరవాన్ని చాటుకున్నారు. 13 ఏళ్ల విరామం తర్వాత శిల్పా శిరోద్కర్ 2013లో జీ టీవీ సీరియల్ 'ఏక్ ముఠీ ఆస్మాన్'తో మళ్లీ నటనా రంగంలోకి ప్రవేశించారు.