పోలీసులతో పెట్టుకోవద్దు: కేటీఆర్ కు రాజాసింగ్ వార్నింగ్
- బీఆర్ఎస్ హయాంలో రేవంత్ ను జైలుకు పంపించారన్న రాజాసింగ్
- రేవంత్ సీఎం అయినా వారిని ఏమీ చేయలేదని వ్యాఖ్య
- రిటైర్ అయిన పోలీసు అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని కేటీఆర్ అంటున్నారని విమర్శ
ఎవరు అధికారంలో ఉంటే వారు చెప్పిన విధంగా పోలీసులు లీగల్ గా చేస్తారని రాజాసింగ్ చెప్పారు. బీజేపీ కార్యకర్తలపై ఎన్నో కేసులు పెట్టి జైలుకు పంపించారని... తనపై కూడా పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపించారని అన్నారు. తనను జైలుకు పంపించే సమయంలో సొంత బీజేపీ పార్టీ నేతలే పోలీసులకు మద్దతుగా నిలిచారని విమర్శించారు. ఇప్పటికీ తమ పార్టీలోని వారే తనకు వెన్నుపోటు పొడవాలనే ఆలోచనలో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.