కోహ్లీ, ధోనీ, డివిలియర్స్‌ను కాదని కుర్రాడిని ఎంచుకున్న సూర్య
- వైభవ్ సిక్సర్లు కొట్టే నైపుణ్యాన్ని ప్రశంసించిన సూర్య
- కోహ్లీ, ధోనీ, డివిలియర్స్ కంటే వైభవ్ వైపే మొగ్గుచూపిన సూర్య
- ఐపీఎల్ 2026లో 72 సిక్సర్లు కొట్టిన వైభవ్
- ఐపీఎల్ 2026లో కేవలం 270 పరుగులే చేసిన సూర్య
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీ, ఏబీ డివిలియర్స్.. క్రికెట్‌లో ఈ దిగ్గజాల పేర్లు తెలియని అభిమానులు ఉండరు. కానీ వీరందరి నుంచి ఒక్క నైపుణ్యం ఎంచుకోమంటే భారత స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం ఓ 15 ఏళ్ల కుర్రాడిని ఎంచుకున్నాడు. అతడే వైభవ్ సూర్యవంశీ. ఈ యువ బ్యాటర్ సిక్సర్లు కొట్టే నైపుణ్యాన్ని తాను తీసుకోవాలనుకుంటున్నట్లు సూర్య తెలిపాడు.
‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సూర్యకుమార్‌ను ఇదే ప్రశ్న అడిగారు. దానికి సమాధానంగా.. ‘వైభవ్ సూర్యవంశీ అనే ఓ కుర్రాడి గురించి మీరు వినే ఉంటారు. అతడి సిక్సర్లు కొట్టే నైపుణ్యాన్ని కచ్చితంగా తీసుకుంటా’ అని చెప్పాడు.
ఐపీఎల్ 2026లో వైభవ్ సంచలన ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. 16 మ్యాచుల్లో 776 పరుగులు చేశాడు. 237.31 స్ట్రైక్‌రేట్‌తో పరుగుల వరద పారించాడు. అత్యధిక పరుగులతో ఆరెంజ్ క్యాప్ దక్కించుకోవడంతో పాటు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డునూ అందుకున్నాడు. టోర్నీలో ఏకంగా 72 సిక్సర్లు బాదాడు. ఒక ఐపీఎల్ సీజన్‌లో ఒక ఆటగాడు కొట్టిన అత్యధిక సిక్సర్లు ఇవే.
మరోవైపు సూర్యకుమార్‌కు ఐపీఎల్ 2026 కలిసిరాలేదు. 12 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 270 పరుగులు చేశాడు. ముంబయి ఇండియన్స్ పది జట్లలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఈ ప్రదర్శన తర్వాత సూర్యకుమార్ కెప్టెన్సీ కోల్పోయాడు. భారత టీ20 జట్టులోనూ చోటు కోల్పోయాడు.
అయితే ఐపీఎల్ 2027లో సూర్యకుమార్ ముంబయి ఇండియన్స్‌లోనే కొనసాగనున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌లో అదరగొట్టిన వైభవ్ భారత టీ20 జట్టులోకి కూడా వచ్చాడు. ప్రస్తుతం ఆసియా క్రీడలు 2026 కోసం ఎంపిక చేసిన భారత జట్టులోనూ అతడు ఉన్నాడు.