‘నేను బాగానే ఉన్నా’.. తన మరణ వార్తలపై స్పందించిన సీనియర్ నటి!
- వడివుక్కరసి మరణ వార్తలు అవాస్తవం
- తాను ఆరోగ్యంగా ఉన్నానని స్పష్టీకరణ
- అభిమానులకు స్వయంగా క్లారిటీ ఇచ్చిన వడివుక్కరసి
- ఆరోగ్యంపై ఆరా తీసిన అభిమానులు, సన్నిహితులకు కృతజ్ఞతలు
తాను మరణించినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు తమిళ సీనియర్ నటి వడివుక్కరసి చెక్ పెట్టారు. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని స్వయంగా ప్రకటించారు. దీంతో ఆమె అభిమానులు, సినీ వర్గాల్లో నెలకొన్న ఆందోళనకు తెరపడింది.
ఇటీవల వడివుక్కరసి ఆరోగ్యంపై సోషల్ మీడియాలో పలు తప్పుడు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. కొందరు ఏకంగా ఆమె చనిపోయారంటూ పోస్టులు పెట్టారు. దీంతో అభిమానులు, సినీ పరిశ్రమకు చెందిన పలువురు ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో ‘తంతి టీవీ’తో మాట్లాడిన వడివుక్కరసి.. తనకు ఎలాంటి అనారోగ్య సమస్య లేదని చెప్పారు. తాను చాలా బాగున్నానని, ఆరోగ్యంగానే ఉన్నానని తెలిపారు. తన గురించి ఆరా తీసిన అభిమానులు, సన్నిహితులకు ఆమె కృతజ్ఞతలు చెప్పారు. అయితే అసలు లేని విషయాన్ని ప్రచారం చేసి అందరినీ ఆందోళనకు గురిచేయడంపై అసహనం వ్యక్తం చేశారు.
దాదాపు ఐదు దశాబ్దాలుగా సినీ, టెలివిజన్ రంగాల్లో కొనసాగుతున్న వడివుక్కరసి 350కి పైగా సినిమాల్లో నటించారు. 40కి పైగా టీవీ సీరియళ్లలోనూ కనిపించారు. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ చిత్రాల్లోనూ నటించారు. సినిమాల్లోకి రాకముందు టీచర్‌గా పనిచేశారు. కమల్‌హాసన్ నటించిన ‘సిగప్పు రోజాక్కల్’తో నటిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘కన్ని పరువతిలే’లో హీరోయిన్‌గా నటించారు.
‘ముతల్ మరియాదై’, ‘పడిక్కాదవన్’, ‘అరుణాచలం’, ‘పడయప్ప’, ‘శివాజీ’, ‘జగమే తందిరమ్’ వంటి చిత్రాల్లో ఆమె గుర్తుండిపోయే పాత్రలు పోషించారు. 2000ల ప్రారంభంలో టీవీ రంగంలోకి అడుగుపెట్టి ‘అలైగల్’, ‘వంశం’, ‘కులదైవం’, ‘కార్తిగై దీపం’ వంటి సీరియళ్లతో బుల్లితెర ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు.