గచ్చిబౌలిలో పక్కకు ఒరిగిన నాలుగంతస్తుల భవనం కూల్చివేత!... వీడియో ఇదిగో
- కొనసాగుతున్న భవనం కూల్చివేత పనులు
- పూర్తిస్థాయిలో కూల్చేందుకు మరికొన్ని గంటల సమయం
- నిన్న రాత్రి పక్కకు ఒరిగిన నాలుగంతస్తుల భవనం
ఈ భవనం చుట్టుపక్కల స్థానికులను హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులు ఖాళీ చేయించి, హైడ్రాలిక్ యంత్రం సాయంతో కూల్చివేస్తున్నారు. పైఅంతస్తు నుంచి కూల్చివేతను ప్రారంభించారు. హైడ్రా, జీహెచ్ఎంసీ సిబ్బంది పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈ భవనం పూర్తిస్థాయిలో కూల్చివేసేందుకు మరికొన్ని గంటలు పట్టనుంది.