గురుగ్రామ్‌లో కూల్చివేతలు.. బుల్డోజర్ ముందుకొచ్చిన నటుడు చంద్రచూర్ సింగ్.. నెటిజన్ల ప్రశంసలు
- గురుగ్రామ్ డీఎల్ఎఫ్ పరిధిలో కూల్చివేతలు
- నటుడు చంద్రచూర్ సింగ్ ర్యాంప్ ధ్వంసం
- అధికారులతో నటుడి కూల్ టాక్
ఈ ప్రాంతంలో అనుమతించిన బిల్డింగ్ ప్లాన్లు, నిబంధనలను ఉల్లంఘించి నిర్మించినట్లు చెబుతున్న పలు అక్రమ నిర్మాణాలపై టౌన్, కంట్రీ ప్లానింగ్ విభాగం శుక్రవారం చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే చంద్రచూర్ సింగ్ ఇంటి వెలుపల ఉన్న ర్యాంప్‌ను కూడా అధికారులు కూల్చివేశారు. డీఎల్ఎఫ్ పరిసరాల్లోని అనధికార కట్టడాలను లక్ష్యంగా చేసుకుని ఈ యాంటీ-ఎన్‌క్రోచ్‌మెంట్ డ్రైవ్ నిర్వహించారు. నటుడి ఇంటి వెలుపల ఉన్న ర్యాంప్‌ను అవసరమైన అనుమతులు లేకుండానే నిర్మించారని అధికారులు పేర్కొన్నారు.
హుందాగా మాట్లాడిన నటుడు
కూల్చివేత జరుగుతున్న సమయంలో 57 ఏళ్ల చంద్రచూర్ సింగ్ బయటకు వచ్చి టీమ్‌తో మాట్లాడారు. తన ఇంటి లోపల కూడా ఏమైనా చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నించిన ఆయన.. ఈ ఆస్తిని తన తండ్రి 1991లో కొనుగోలు చేశారని అధికారులకు గుర్తుచేశారు. ర్యాంప్ తొలగింపును ఆయన ప్రశ్నించినప్పటికీ, సంభాషణ అంతటా ఎంతో నిబ్బరంగా ఉన్నారు.
ఈ కూల్చివేతను అధికారికంగా రికార్డ్ చేస్తున్నారా అని అడిగిన సింగ్.. ఆపరేషన్‌కు నాయకత్వం వహిస్తున్న అధికారి పేరును అడిగి తెలుసుకున్నారు. జిల్లా టౌన్ ప్లానర్ అమిత్ మధౌలియా తానెవరో పరిచయం చేసుకోగా.. చంద్రచూర్ సింగ్ ఆయనతో పాటు బృందంలోని ఇతర సభ్యులతో కరచాలనం చేశారు. దాంతో ఈ వివాదం ఎంతో స్నేహపూర్వక వాతావరణంలో ముగిసింది.
చంద్రచూర్ సింగ్ ఇటీవలి చిత్రాలు
సినిమాల విషయానికి వస్తే.. చంద్రచూర్ సింగ్ చివరిసారిగా వికాస్ రంజన్ మిశ్రా దర్శకత్వం వహించిన ‘బయాన్’ (2025) అనే పోలీస్ ఇన్వెస్టిగేటివ్ చిత్రంలో కనిపించారు. ఒక శక్తివంతమైన కల్ట్ లీడర్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను విచారించే పోలీస్ ఆఫీసర్ రూహి పాత్రలో హుమా ఖురేషి ఈ చిత్రంలో నటించారు. ఈ సినిమాలో సచిన్ ఖేడేకర్, అవజిత్ దత్, సాంపా మండల్, ప్రీతి శుక్లా, అదితి కాంచన్ సింగ్, పరితోష్ సాండ్, విభోర్ మయాంక్, స్వాతి దాస్, పెర్రీ ఛబ్రా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ‘బయాన్’ చిత్రం 2025 టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో డిస్కవరీ విభాగంలో ప్రీమియర్ అవ్వడమే కాకుండా.. 30వ బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘ఎ విండో ఆన్ ఏషియన్ సినిమా’ విభాగంలోనూ ప్రదర్శితమైంది.