విజయవాడ - హైదరాబాద్ హైవేపై ఘోర ప్రమాదం.. చిన్నారితో సహా నలుగురు మృతి

Vijayawada Hyderabad Highway Accident Four Dead Including Child
  • కారును వెనుక నుంచి ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు
  • చిన్నారితో సహా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
  • నల్గొండ జిల్లా చిట్యాల మండలం వద్ద ఘటన
  • ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై జరిగిన ఈ దుర్ఘటనలో ఎనిమిదేళ్ల బాలుడితో సహా నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాద ఘటన చిట్యాల మండల పరిధిలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. చిట్యాల మండలం పెద్దకాపర్తి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ వైపు వెళ్తున్న కారును వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది.

ప్రమాదంలో మృతి చెందిన వారంతా తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన ఒకే కుటుంబ సభ్యులుగా గుర్తించారు. వీరు ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కారు డ్రైవర్‌ను నార్కట్‌పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.                                
Hyderabad Vijayawada Highway Accident
Nalgonda Road Accident
Chityala Bus Car Collision
Four Dead in Road Accident
Kakinada Family Accident Nalgonda
Telangana Highway Accident News

More Telugu News