ఇక నుంచి అలా చేయను... లోకేశ్, పవన్, అనితలకు సారీ చెప్పిన శ్రీరెడ్డి
- సోషల్ మీడియా పోస్టులపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం
- వీడియోతో తెరపైకి వచ్చిన శ్రీరెడ్డి
- తన సోషల్ మీడియాలో ఇకపై అలాంటి పోస్టులు ఉండవని వెల్లడి
"నా కుటుంబాన్ని, నా భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. నాకు భవిష్యత్తేమీ లేదనుకోండి... నేనేమీ పెళ్లి, పెటాకుల గురించి ఆలోచించడంలేదు. నా వల్ల నా ఫ్యామిలీకి ఇబ్బంది రాకూడదని కోరుకుంటున్నాను. ఇక నుంచి నా సోషల్ మీడియా ఖాతాలో మీ కుటుంబ సభ్యుల గురించి ఎలాంటి తప్పుడు ప్రచారం జరగదు అని హామీ ఇస్తున్నాను.
సోషల్ మీడియా పోస్టులపై యుద్ధాన్ని నేతల స్థాయిలో చూసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నాతో సహా మా కార్యకర్తలను దయచేసి వదిలిపెట్టండి" అంటూ శ్రీరెడ్డి తన వీడియో సందేశంలో పేర్కొన్నారు.