శ్రీశాంత్‌నే నా రూమ్‌మేట్‌గా ఎంచుకుంటా: హర్భజన్ సింగ్

Harbhajan Singh says I will choose Sreesanth as my roommate
  • తాజాగా మళ్లీ తెరపైకి వచ్చిన హర్భజన్, శ్రీశాంత్ మధ్య విభేదాలు
  • వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం చేసిన భజ్జీ
  • ఇద్దరం ఒకే గదిలో ఉంటే సమస్యలు పరిష్కారమవుతాయని వ్యాఖ్య

భారత మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, శ్రీశాంత్ మధ్య ఉన్న విభేదాల గురించి అందరికీ తెలిసిందే. 2008 ఐపీఎల్ సీజన్ నాటి 'స్లాప్‌గేట్' వివాదం నుంచి ఇటీవలే శ్రీశాంత్ విసిరిన బాక్సింగ్ రింగ్ ఛాలెంజ్ వరకు వీరిద్దరి మధ్య విభేదాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్భజన్ సింగ్ ఎవరూ ఊహించని వ్యాఖ్యలు చేశారు.


తనకు ఎవరినైనా రూమ్‌మేట్‌గా ఎంచుకునే అవకాశం వస్తే శ్రీశాంత్‌నే ఎంచుకుంటానని భజ్జీ వెల్లడించారు. "ఒకవేళ మేమిద్దరం ఒకే గదిలో ఉంటే, మా మధ్య ఉన్న చాలా సమస్యలు, మనస్పర్థలు పరిష్కారమవుతాయి. నేను దానిని ఆ కోణంలోనే చూస్తున్నాను. ఆయనను నా రూమ్‌మేట్‌గా ఎంపిక చేసినా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు" అని హర్భజన్ స్పష్టం చేశారు.


ఇటీవల హర్భజన్ ఒక అడ్వర్టైజ్‌మెంట్ చేయడం వల్ల తమ పాత వివాదం మళ్లీ తారస్థాయికి చేరిందని, దమ్ముంటే తనతో బాక్సింగ్ రింగ్‌లోకి రావాలని శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్ విసిరిన సంగతి తెలిసిందే. అయితే హర్భజన్ మాత్రం వివాదాన్ని పెంచకుండా, ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు సమసిపోతాయనే ఉద్దేశంతో ఈ సానుకూల స్పందన తెలియజేశారు.

Advertisement
Harbhajan Singh
Sreesanth
IPL Slapgate
Cricket Controversy
Harbhajan Singh Sreesanth Roommate
Indian Cricket News

More Telugu News