మీరు చేయకపోతే మేమే చేస్తాం: ప్యాకేజ్డ్ ఫుడ్‌ అంశంలో కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

Supreme Court warns Center over delay in packaged food warning labels
  • ప్యాకేజ్డ్ ఫుడ్‌పై హెచ్చరిక లేబుళ్లపై కేంద్రానికి సుప్రీంకోర్టు అల్టిమేటం
  • కార్పొరేట్ సంస్థల ఒత్తిడికి తలొగ్గుతున్నారా అని కేంద్రాన్ని నిలదీత
  • తుది నిర్ణయం చెప్పేందుకు ప్రభుత్వానికి రెండు వారాల గడువు
అధిక మొత్తంలో ఉప్పు, చక్కెర, కొవ్వు ఉండే ప్యాకేజ్డ్ ఆహార పదార్థాల ప్యాకెట్లపై ముందు భాగంలో హెచ్చరిక లేబుళ్లను తప్పనిసరి చేయడంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ)పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. "మీరు చేయలేకపోతే, మేమే అమలు చేసేలా చూస్తాం" అంటూ గట్టి హెచ్చరిక జారీ చేసింది. ఈ విషయంలో తుది నిర్ణయం తెలియజేయడానికి కేంద్రానికి రెండు వారాల గడువును మంజూరు చేసింది.

జస్టిస్ జె.బి. పార్దీవాలా, జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఈ అంశంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించింది. ఇది ప్రజల, ముఖ్యంగా చిన్నారుల ఆరోగ్యానికి సంబంధించిన కీలకమైన అంశమని, కార్పొరేట్ సంస్థల ఒత్తిడికి తలొగ్గి నిర్ణయాలు తీసుకోవద్దని ధర్మాసనం స్పష్టం చేసింది. "తయారీదారులు తమ వ్యాపారం దెబ్బతింటుందన్న ఉద్దేశంతో ఈ లేబుళ్లను వ్యతిరేకించవచ్చు, కానీ తాము కొనుగోలు చేసే వస్తువులో ఏయే పదార్థాలు ఉన్నాయో తెలుసుకునే హక్కు వినియోగదారులకు ఉంటుంది" అని కోర్టు వ్యాఖ్యానించింది.

అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తే నమ్‌కీన్ వంటి భారతీయ సంప్రదాయ ఆహార పదార్థాలపై కూడా 'రెడ్ మార్క్' పడుతుందని కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ బ్రిజేందర్ చాహర్ వాదించారు. అయితే, ఈ వాదనను కోర్టు తోసిపుచ్చింది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం ప్రభుత్వం బాధ్యత కాదా అని ప్రశ్నించింది. రెండు వారాల్లోగా ప్రభుత్వం తన తుది నిర్ణయాన్ని తెలియజేయాలని, లేనిపక్షంలో తదుపరి విచారణలో తామే తగిన ఉత్తర్వులు వెలువరిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
Advertisement
Supreme Court of India
Packaged Food Warning Labels
FSSAI India
Central Government
Public Health Safety

More Telugu News