టీవీ స్క్రీన్‌ క్లీన్‌ చేస్తున్నారా? ఈ వస్తువులతో మాత్రం తుడవకండి!

TV Screen Cleaning tips and 10 things you must avoid
  • టీవీ స్క్రీన్‌కు నేరుగా సబ్బు నీరు లేదా నీటిని స్ప్రే చేయొద్దు
  • గ్లాస్‌ క్లీనర్లు, ఆల్కహాల్‌, బ్లీచ్‌, అమ్మోనియా వాడొద్దు
  • పేపర్‌ టవల్స్‌, టిష్యూలు, రఫ్‌ క్లాత్‌తో స్క్రీన్‌ తుడవొద్దు
  • శుభ్రం చేసేందుకు మెత్తని మైక్రోఫైబర్‌ క్లాత్‌నే ఉపయోగించాలి
  • స్క్రీన్‌పై గట్టిగా ఒత్తిడి పెట్టడం వల్ల డిస్‌ప్లే దెబ్బతినొచ్చు
టీవీ స్క్రీన్‌పై దుమ్ము, వేలిముద్రలు కనిపిస్తే వెంటనే ఏదో ఒక క్లీనర్‌తో తుడిచేస్తుంటారు. కానీ ఆధునిక ఎల్‌ఈడీ, ఓఎల్‌ఈడీ, క్యూఎల్‌ఈడీ, మినీ ఎల్‌ఈడీ టీవీలపై ఇలా చేయడం వల్ల స్క్రీన్‌ దెబ్బతినే ప్రమాదం ఉంది. ముఖ్యంగా డిస్‌ప్లేపై ఉండే యాంటీ-గ్లేర్‌, యాంటీ-రిఫ్లెక్టివ్‌ కోటింగ్‌ దెబ్బతింటే దాన్ని తిరిగి పునరుద్ధరించడం సాధ్యం కాదు. అందుకే టీవీ స్క్రీన్‌ శుభ్రం చేసేటప్పుడు సరైన పద్ధతి పాటించడం ముఖ్యం.

మొండి మరకలు, వేలిముద్రలు తొలగించాల్సి వస్తే కొద్దిపాటి మైల్డ్‌ డిష్‌ సోప్‌ను డిస్టిల్డ్‌ వాటర్‌లో బాగా పలుచగా కలిపి ఉపయోగించవచ్చు. ఆ ద్రావణంలో మైక్రోఫైబర్‌ క్లాత్‌ను ముంచి పూర్తిగా పిండి, స్వల్పంగా తడిగా ఉన్న క్లాత్‌తో స్క్రీన్‌ను మెల్లగా తుడవాలి. తర్వాత పొడి మైక్రోఫైబర్‌ క్లాత్‌తో మిగిలిన తేమను తొలగించాలి. అయితే టీవీపై నేరుగా నీరు లేదా సబ్బు ద్రావణాన్ని స్ప్రే చేయకూడదు.

గ్లాస్‌ క్లీనర్లు, ఆల్కహాల్‌, అసిటోన్‌, బ్లీచ్‌, అమ్మోనియా వంటి బలమైన రసాయనాలను మాత్రం టీవీ స్క్రీన్‌పై ఉపయోగించకూడదు. అలాగే పేపర్‌ టవల్స్‌, టిష్యూలు, పాత టీషర్ట్లు, రఫ్‌ క్లాత్‌లు, కిచెన్‌ స్పాంజ్‌లు, స్క్రబ్బర్లు కూడా స్క్రీన్‌పై గీతలు పడేలా చేయొచ్చు. బేబీ వైప్స్‌, వెట్‌ వైప్స్‌లో ఉండే రసాయనాలు కూడా స్క్రీన్‌పై పొరను దెబ్బతీయొచ్చు.

స్క్రీన్‌ను శుభ్రం చేసేటప్పుడు గట్టిగా రుద్దడం లేదా ఎక్కువ ఒత్తిడి పెట్టడం కూడా ప్రమాదకరమే. ముఖ్యంగా ఓఎల్‌ఈడీ, ఎల్‌ఈడీ ప్యానెళ్లపై సున్నితంగా తుడవాలి. స్క్రీన్‌ అంచుల్లోకి ద్రవం వెళ్లకుండా జాగ్రత్తపడాలి. సాధారణ దుమ్ము, వేలిముద్రలకు శుభ్రమైన పొడి మైక్రోఫైబర్‌ క్లాత్‌ ఉపయోగించడమే సురక్షితమైన మార్గం.
Advertisement
TV Screen Cleaning
LED OLED TV care
Smart TV maintenance tips
Avoiding TV screen damage
Safe TV cleaning products
Microfiber cloth benefits

More Telugu News