రైల్వేలో 2,424 ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల
- 2,424 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి సెంట్రల్ రైల్వే నోటిఫికేషన్
- ఆగస్టు 15 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం
- 10వ తరగతి పాసై, ఐటీఐ శిక్షణ పొందిన వారు అర్హులు
వయసు, ఎంపిక ఇలా..
ఇక దరఖాస్తుదారుల వయసు 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు వయసులో సడలింపు ఉంది. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీకి 3 ఏళ్లు సడలింపు ఇస్తున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొంది. వయోపరిమితికి జులై 15 కటాఫ్ తేదీగా ఉంది. కాగా అభ్యర్థులు మ్యాథ్స్, ఐటీఐలో సాధించిన మార్కుల సగటు ఆధారంగా మెరిట్ లిస్టును తయారు చేస్తారు. షార్ట్‌లిస్ట్‌కు ఎంపికైన అభ్యర్థులను సర్టిఫికేట్‌ల వెరిఫికేషన్ కోసం పిలుస్తారు. కాగా మరింత సమాచారం కావాలనుకున్న అభ్యర్థులు సెంట్రల్ రైల్వేస్ అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు.