నిజ జీవితంలో విజయ్ హీరో కాదు, విలన్: టీటీవీ దినకరన్ తీవ్ర వ్యాఖ్యలు

నిజ జీవితంలో విజయ్ హీరో కాదు, విలన్: టీటీవీ దినకరన్ తీవ్ర వ్యాఖ్యలు

TTV Dhinakaran calls Vijay a real life villain not a hero
  • విజయ్ సినిమాల్లోనే హీరో అన్న దినకరన్
  • అసెంబ్లీలో విజయ్ చేసిన సైగ స్టాలిన్‌ను కించపరిచేలా ఉందని ఆరోపణ
  • ఈ ఘటనతో తమిళ రాజకీయాల్లో మరింత ముదిరిన మాటల యుద్ధం
తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్‌పై ఏఎంఎంకే చీఫ్ టీటీవీ దినకరన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లోనే విజయ్ హీరో అని, నిజ జీవితంలో మాత్రం ఆయనో ఒక పెద్ద విలన్ అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో విజయ్ చేసిన ఒక సైగపై వివాదం చెలరేగిన నేపథ్యంలో దినకరన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల తమిళనాడు అసెంబ్లీలో విజయ్ చేసిన ఒక సైగ, ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌ను అపహాస్యం చేసేలా ఉందన్న విమర్శలతో రాజకీయ దుమారం రేగింది. 1976 ఎమర్జెన్సీ కాలంలో జైలులో పోలీసుల దాడి కారణంగా స్టాలిన్ దవడ ఎముక విరిగింది. విజయ్ చేసిన సైగ ఆ విషయాన్ని ఎగతాళి చేసేలా ఉందని డీఎంకే నేతలు మండిపడ్డారు. అయితే, ఆ సైగ యాదృచ్ఛికంగా జరిగిందే తప్ప ఉద్దేశపూర్వకం కాదని విజయ్ వివరణ ఇచ్చారు. అయినప్పటికీ ఈ వివాదం సద్దుమణగలేదు. స్వయంగా స్టాలిన్ కూడా ఈ అంశంపై స్పందిస్తూ, జైలులో తాను అనుభవించిన చిత్రహింసలను గుర్తుచేసుకున్నారు. తమిళనాడు రాజకీయ చరిత్రను చదువుకోవాలని విజయ్‌కు హితవు పలికారు.

ఈ వివాదంపై దినకరన్ మరింత ఘాటుగా స్పందించారు. "విజయ్ ఒక స్వార్థపరుడు, తన స్వలాభం కోసం ఎవరినైనా బలి ఇచ్చే మనస్తత్వం ఉన్న వ్యక్తి. ఆయన మాట తీరు, బాడీ లాంగ్వేజ్ చూస్తుంటేనే ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో అర్థమవుతోంది" అని దినకరన్ తీవ్రంగా ఆరోపించారు.
Advertisement
TTV Dhinakaran
Vijay TVK
MK Stalin
Tamil Nadu Assembly
Tamilaga Vettri Kazhagam

More Telugu News