ఆకలేసినప్పుడు కడుపులో శబ్దాలు ఎందుకు? అసలు కారణం ఇదే!
- కడుపులో గురగుర శబ్దానికి ఆకలి ఒక్కటే కారణం కాదంటున్న నిపుణులు
- జీర్ణవ్యవస్థ కదలికలతో గ్యాస్, ద్రవాలు కదలడం వల్లే శబ్దాలు
- కడుపు ఖాళీగా ఉన్నప్పుడు శబ్దాలు ఎక్కువగా వినిపించే అవకాశం
- బీన్స్, వెల్లుల్లి, ఉల్లిపాయలు, యాపిల్స్‌తో గ్యాస్ పెరిగే ఛాన్స్
- బరువు తగ్గడం, జ్వరం, నల్లటి మలం ఉంటే నిర్లక్ష్యం చేయొద్దు
నిశ్శబ్దంగా కూర్చున్నప్పుడు ఒక్కసారిగా కడుపులో గురగుర శబ్దం వస్తుంది. వెంటనే మనకు గుర్తొచ్చేది ఒక్కటే.. ‘ఆకలేస్తోంది’ అని! కానీ కడుపులో వచ్చే ఈ శబ్దానికి ఆకలి ఒక్కటే కారణం కాదు. 'ఇండియా టుడే' కథనంలో పేర్కొన్న ఆ వివరాలేంటో చూద్దాం..
కడుపు ఖాళీగా ఉంటే.. శబ్దం ఎందుకు?
తిన్న తర్వాత కూడా జీర్ణవ్యవస్థలో ఆహారం ముందుకు కదిలేలా పేగులు పనిచేస్తూనే ఉంటాయి. భోజనం మధ్యలో కడుపు ఖాళీగా ఉన్న సమయంలోనూ పేగుల్లో సంకోచాలు కొనసాగుతాయి. దీన్ని ‘మైగ్రేటింగ్ మోటార్ కాంప్లెక్స్’ (ఎంఎంసీ) అంటారు. ఈ కదలికల సమయంలో గ్యాస్, ద్రవాలు జీర్ణవ్యవస్థలో ముందుకు కదులుతాయి. అప్పుడు వచ్చే శబ్దాలనే మనం కడుపులో గురుగురగా వింటాం.
ఆకలికి.. ఈ శబ్దానికి సంబంధమేంటి?
కడుపులో ఆహారం ఉన్నప్పుడు లోపలి కదలికల శబ్దం అంతగా బయటకు వినిపించకపోవచ్చు. కడుపు ఖాళీగా ఉంటే ఈ శబ్దాలు మరింత స్పష్టంగా వినిపిస్తాయి. అందుకే ఆకలేసినప్పుడు కడుపు ఎక్కువగా శబ్దం చేస్తున్నట్టు అనిపిస్తుంది. అయితే కడుపు శబ్దం వస్తే తప్పనిసరిగా ఆకలిగా ఉన్నట్టు కాదు. తిన్న తర్వాత కూడా జీర్ణవ్యవస్థ కదలికల వల్ల ఇలాంటి శబ్దాలు రావచ్చు.
కొన్ని ఆహారాలతో శబ్దం మరింత ఎక్కువ!
భోజనం మధ్యలో నాలుగు నుంచి ఆరు గంటల వ్యవధి ఉండొచ్చని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ విశాల్ ఖురానా చెబుతున్నారు. అయితే ఆహారం జీర్ణం కావడానికి పట్టే సమయం ప్రతి ఒక్కరిలో ఒకేలా ఉండదు. కార్బొనేటెడ్ డ్రింక్స్, బీన్స్, వెల్లుల్లి, ఉల్లిపాయలు, యాపిల్స్ వంటి వాటితో గ్యాస్ పెరగొచ్చు. దీంతో పేగుల్లో గ్యాస్, ద్రవాలు కదిలే సమయంలో శబ్దాలు మరింత ఎక్కువగా వినిపించొచ్చు. కాబట్టి కొన్ని ఆహారాలు తిన్న తర్వాతే శబ్దాలు పెరుగుతున్నాయంటే వాటి ప్రభావం కూడా ఉండొచ్చు.
శబ్దంతో పాటు ఇవి ఉంటే జాగ్రత్త!
అప్పుడప్పుడు కడుపులో శబ్దాలు రావడం సాధారణమే. దానికి ప్రత్యేకంగా భయపడాల్సిన అవసరం లేదు. కానీ శబ్దాలు ఎక్కువకాలం కొనసాగుతూ కడుపునొప్పి, వికారం, వాంతులు ఉంటే మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. మలబద్ధకం, విరేచనాలు, కారణం తెలియకుండా బరువు తగ్గడం, జ్వరం వంటి లక్షణాలు కనిపించినా వైద్యుడిని సంప్రదించాలి. హిమోగ్లోబిన్ తగ్గడం లేదా నల్లటి మలం కనిపించడం కూడా హెచ్చరిక సంకేతాలే. అందుకే కడుపు గురగురను కేవలం ఆకలిగా భావించకుండా, ఇతర లక్షణాలు ఉన్నాయా లేదా గమనించడం ముఖ్యం.