కాఫీ తాగితే శరీరంలో ఐరన్ లోపిస్తుందా? డాక్టర్లు చెబుతున్న అసలు విషయం ఇదే!
- నాన్-హీమ్ ఐరన్ శోషణను కాఫీ తగ్గించే ఛాన్స్
- ఐరన్ అధికంగా ఉన్న భోజనంతో కాఫీ తీసుకోకపోవడం మంచిదని నిపుణుల సూచన
- ఐరన్ సప్లిమెంట్లను కాఫీతో కలిపి తీసుకోకూడదని సలహా
- ఐరన్ లోపం ఉన్నవారు కాఫీ సమయంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచన
- ఐరన్ లోపం ఉంటే అసలు కారణాన్ని గుర్తించి చికిత్స పొందాలని సూచన
ఉదయం లేవగానే ఓ కప్పు కాఫీ.. చాలామందికి ఇది రోజును మొదలుపెట్టే చిన్న అలవాటు. అయితే అదే కాఫీని అల్పాహారంతో పాటు తీసుకుంటే మాత్రం శరీరానికి అందాల్సిన ఐరన్ తగ్గే అవకాశం ఉందని ఆస్టర్ వైట్‌ఫీల్డ్ ఆసుపత్రిలో చీఫ్ డైటీషియన్ వీణా ఎన్‌డీటీవీతో తెలిపారు. ముఖ్యంగా మొక్కల ఆధారిత ఆహారం నుంచి ఐరన్ పొందేవారు ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
ఐరన్ శోషణపై ప్రభావం
కాఫీలో పాలీఫినాల్స్ ఉంటాయి. ముఖ్యంగా క్లోరోజెనిక్ యాసిడ్స్ వంటి సమ్మేళనాలు మొక్కల ఆహారంలో ఉండే నాన్-హీమ్ ఐరన్ శోషణను తగ్గించగలవు. దీంతో పప్పులు, బీన్స్, కూరగాయలు, నట్స్, ఐరన్ కలిపిన ఆహారం నుంచి శరీరానికి అందే ఐరన్ పరిమాణం తగ్గొచ్చు.
భోజనం తర్వాత కాఫీతోనూ సమస్య
ఐరన్ ఎక్కువగా ఉండే భోజనం తిన్న వెంటనే కాఫీ తాగినా ఈ ప్రభావం కనిపించొచ్చు. ఐరన్ సప్లిమెంట్లు తీసుకునేవారు కూడా కాఫీతో కలిపి మాత్రలు వేసుకోకపోవడం మంచిది. అయితే కాఫీ తాగిన ప్రతిసారీ ఐరన్ లోపం వస్తుందని భావించాల్సిన అవసరం లేదు.
ఎవరు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి?
ఇప్పటికే ఐరన్ లోపం ఉన్నవారు, ఐరన్ అవసరం ఎక్కువగా ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలి. ఆహారంలో ఎక్కువ భాగం మొక్కల ఆధారిత ఐరన్‌పై ఆధారపడేవారూ కాఫీ సమయాన్ని గమనించాలి.
‘విటమిన్-సి’తో మేలు
ఐరన్ ఉన్న ఆహారంతో విటమిన్-సి తీసుకోవడం శోషణకు సహాయపడుతుంది. ఉసిరి, జామ, టమాటా, క్యాప్సికమ్, సిట్రస్ పండ్లను భోజనంలో చేర్చుకోవచ్చు. మరోవైపు టీ, కాఫీలోని కొన్ని సమ్మేళనాలు, కాల్షియం ఐరన్ శోషణకు అడ్డంకిగా మారొచ్చు.
లోపం ఉంటే కారణం తెలుసుకోవాలి
ఐరన్ లోపం లేదా రక్తహీనత నిర్ధారణ అయితే కాఫీ సమయం మార్చడం ఒక్కటే పరిష్కారం కాదు. ఆహార లోపం, శరీరంలో ఐరన్ శోషణ తగ్గడం, రక్తస్రావం వంటి కారణాలను గుర్తించాలి. మహిళల్లో అధిక నెలసరి రక్తస్రావం కూడా కారణం కావచ్చు. అవసరమైతే వైద్యుల సలహాతో చికిత్స తీసుకోవాలి.
కాఫీ మానేయాల్సిన పనిలేదు
ఆరోగ్యంగా ఉన్నవారు కాఫీని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. ఐరన్ సప్లిమెంట్‌తో కలిపి తాగకుండా ఉండటం, ఐరన్ అధికంగా ఉన్న భోజనం తర్వాత వెంటనే కాఫీ తీసుకోకుండా ఉండటం ఉపయోగకరం. ఐరన్ లోపం ఉన్నవారు ఈ విషయంలో మరింత జాగ్రత్త వహించాలి.