80ల లుక్ కోసం ఫొటో అప్‌లోడ్ చేస్తున్నారా? ఈ రిస్క్‌లు మాత్రం మర్చిపోవద్దు!
- 80ల ఫొటో ట్రెండ్‌తో ఏఐ చిత్రాలు వైరల్
- సెల్ఫీతో పాటు వ్యక్తిగత సమాచారం కూడా బయటపడే అవకాశం
- ఫొటో మెటాడేటాలో తేదీ, డివైజ్, లొకేషన్ వివరాలు
- సున్నితమైన ఫొటోలు, వ్యక్తిగత పత్రాలు ఏఐకి అప్‌లోడ్ చేయొద్దని నిపుణుల సూచన
- ప్రైవసీ సెట్టింగ్స్ చెక్ చేసి అవసరమైన ఫొటోలే అప్‌లోడ్ చేయాలని హెచ్చరిక
ఒకప్పుడు 80ల నాటి ఫొటో కావాలంటే పాత ఆల్బమ్ తిరగేయాల్సిందే. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. చేతిలో ఉన్న ఒక్క సెల్ఫీని చాట్‌జీపీటీకి ఇస్తే చాలు.. కాసేపట్లోనే పెద్ద జుట్టు, అప్పటి దుస్తులు, స్టూడియో లైటింగ్, పాతకాలపు ఫిల్మ్ గ్రెయిన్‌తో అచ్చం 80ల నాటి ఫొటోలా మార్చేస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ట్రెండ్ వైరల్‌గా మారింది. ఫలితాలు కూడా చాలా సహజంగా ఉండటంతో రోజురోజుకూ దీనిపై ఆసక్తి పెరుగుతోంది.
అయితే ఫొటోను అప్‌లోడ్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం చూస్తున్నది కేవలం ఓ ఫొటో మాత్రమే. కానీ, దానిలో మన ముఖం, చుట్టూ ఉన్న ప్రదేశం, ఇతర వ్యక్తులు వంటి చాలా సమాచారం ఉండొచ్చు.
ఫొటోలో కనిపించనిది కూడా డేటానే
ఓ ఫొటోలో ముఖమే కాకుండా మరికొన్ని వివరాలు ఉండొచ్చు. అసలు ఫొటో ఫైల్‌లో తేదీ, ఏ పరికరంతో తీశారు వంటి మెటాడేటా ఉండే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో లొకేషన్ సమాచారం కూడా ఉండొచ్చు.
ఫొటో వెనుక కనిపించే ఇల్లు, ఇంటి నంబర్, రోడ్డు పేరు, వాహనం నంబర్ ప్లేట్, కార్యాలయం వంటి వివరాలు కూడా వ్యక్తిగత సమాచారాన్ని బయటపెట్టొచ్చు. పక్కన ఉన్న మరో వ్యక్తి ముఖం కూడా అనుకోకుండా ఫొటోలోకి రావచ్చు.
అప్‌లోడ్ చేశాక ఏం జరుగుతుంది?
చాట్‌జీపీటీలో ఫొటో అప్‌లోడ్ చేస్తే అది మన ఇంటరాక్షన్‌లో భాగమవుతుంది. దాన్ని ఎలా నిర్వహిస్తారనేది మనం ఉపయోగిస్తున్న సేవ, ఖాతా రకం, డేటా సెట్టింగ్స్‌పై ఆధారపడి ఉంటుంది.
కన్జ్యూమర్ ఖాతాల్లోని కంటెంట్‌ను మోడళ్లను మెరుగుపరచడానికి ఉపయోగించే అవకాశం ఉందని ఓపెన్‌ఏఐ చెబుతోంది. అయితే ప్రతి ఫొటోను ఆటోమేటిక్‌గా ఏఐ శిక్షణకు ఉపయోగిస్తారని అర్థం కాదు. వినియోగదారుడి సెట్టింగ్స్ కూడా ఇందులో కీలకం. బిజినెస్ ఉత్పత్తులు, ఏపీఐ డేటాను డిఫాల్ట్‌గా మోడల్ శిక్షణకు ఉపయోగించబోమని ఓపెన్‌ఏఐ పేర్కొంది.
సెల్ఫీ పెడితే ప్రమాదమేనా?
సాధారణ సెల్ఫీని నమ్మకమైన ఏఐ సేవలో అప్‌లోడ్ చేయడం వల్ల తప్పనిసరిగా ప్రమాదం జరుగుతుందని చెప్పలేం. కానీ ఫొటో అప్‌లోడ్ చేసిన తర్వాత దాని కాపీ మన ఫోన్‌లో మాత్రమే కాదు.. ఏఐ ఏజెంట్ సర్వర్ లో కూడా ఉంటుంది. అందుకే జాగ్రత్త అవసరం.
ముఖ్యంగా గుర్తింపు కార్డులు, వ్యక్తిగత రికార్డులు, అత్యంత సున్నితమైన ఫొటోలు, ప్రైవేట్ లేదా సన్నిహిత చిత్రాలను అప్‌లోడ్ చేయకపోవడం మంచిది. ఇతరుల ఫొటోలు, ముఖ్యంగా పిల్లల ఫొటోలు, వారి అనుమతి లేకుండా అప్‌లోడ్ చేయకూడదు.
అప్‌లోడ్ చేసే ముందు అవసరం లేని బ్యాక్‌గ్రౌండ్‌ను కట్ చేయొచ్చు. ఇంటి నంబర్లు, వాహన నంబర్ ప్లేట్లను బ్లర్ చేయొచ్చు. ప్రైవసీ సెట్టింగ్స్‌ను కూడా ఒకసారి పరిశీలించాలి.
ప్రైవసీ పెంచుకోవాలంటే..
చాట్‌జీపీటీలో సెట్టింగ్స్ > డేటా క్రంటోల్స్‌లోకి వెళ్లి ‘‘ఇంప్రూవ్ ది మోడల్ ఫర్ ఎవ్రీవన్’’ ఆప్షన్‌ను ఆఫ్ చేయొచ్చు. కొత్త సంభాషణలను మోడల్ మెరుగుదలకు ఉపయోగించకూడదనుకునేవారికి ఇది ఉపయోగపడుతుంది.
మరో మార్గం టెంపరరీ చాట్. ఓపెన్‌ఏఐ ప్రకారం.. ఇలాంటి చాట్లు మోడల్ శిక్షణకు ఉపయోగించరు. చాట్ హిస్టరీలోనూ కనిపించవు. కొన్ని మినహాయింపులు మినహా 30 రోజుల్లో సిస్టమ్స్ నుంచి ఆటోమేటిక్‌గా తొలగిస్తారు.
ఒక్క ఫొటోకు కూడా ఓ ఖర్చుంది
ఈ ట్రెండ్‌లో మరో కోణం ఉంది. ఏఐతో ఒక్క ఫొటో తయారు చేయడానికి కూడా విద్యుత్ అవసరమే. కార్నెగీ మెలన్ యూనివర్సిటీ, హగ్గింగ్ ఫేస్ పరిశోధన ప్రకారం.. ఏఐ ఇమేజ్ తయారీకి సిస్టమ్, ప్రక్రియను బట్టి సుమారు 0.01 నుంచి 0.29 కిలోవాట్ అవర్ వరకు విద్యుత్ ఖర్చు కావచ్చు.
ఒక్క ఫొటోకు ఇది పెద్ద మొత్తంగా అనిపించకపోవచ్చు. కానీ లక్షల మంది ఒకేసారి ఇదే ట్రెండ్‌లో చేరితే ప్రభావం పెరుగుతుంది. అందుకే నచ్చిన ఒక్క ఫొటో కోసం పదుల కొద్దీ ఒకే తరహా చిత్రాలు తయారు చేయడం కంటే అవసరమైనన్ని మాత్రమే రూపొందించడం మంచిది.