2027 ప్రపంచకప్‌లో ఆడతారా? రోహిత్ శర్మ సమాధానమిదే..!
- ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో స్పందించిన రోహిత్ శర్మ
- ‘‘అప్పటికి చూద్దాం’’ అంటూ దాటవేసే ప్రయత్నం
- ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న రోహిత్
- ఇంగ్లాండ్‌పై చివరి వన్డేలో 138 పరుగులు చేసిన శర్మ
- రోహిత్ భవిష్యత్తుపై చర్చల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యం
2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ ఆడతాడా? కొంతకాలంగా ఈ ప్రశ్నపై చర్చ జరుగుతోంది. దీనిపై రోహిత్ తాజాగా స్పందించాడు. అయితే తన నిర్ణయాన్ని మాత్రం స్పష్టంగా వెల్లడించలేదు.
ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌లో పాల్గొన్న రోహిత్‌ను ఓ అభిమాని ఇదే విషయంపై ప్రశ్నించాడు. 2027 అక్టోబర్‌లో జరిగే ప్రపంచకప్‌లో ఆడతారా? అని అడిగాడు. దీనికి ‘‘2027 అక్టోబర్ చాలా దూరంలో ఉంది. అప్పటికి చూద్దాం’’ అని రోహిత్ బదులిచ్చాడు. దీంతో ప్రపంచకప్ ఆడే విషయంపై రోహిత్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టమైంది.
రోహిత్ ఇప్పటికే టెస్టులు, టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. 2027 ప్రపంచకప్‌కు దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
ఇదే కార్యక్రమంలో.. 2027 ప్రపంచకప్‌ను భారత్ గెలిస్తే 2024 టీ20 ప్రపంచకప్ విజయోత్సవంలా ముంబైలో బస్ పరేడ్ నిర్వహిస్తారా? అని రోహిత్‌ను అడిగారు. ‘‘ఇప్పుడు బస్ పరేడ్ సాధ్యమవుతుందని అనుకోవడం లేదు’’ అని సరదాగా స్పందించాడు.
రోహిత్ భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలను బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా గతంలో కొట్టిపారేశారు. రోహిత్ అద్భుతంగా ఆడుతున్నప్పుడు అతడి ఎంపికపై సందేహాలు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. ఇంగ్లాండ్‌తో జరిగిన చివరి వన్డేలో రోహిత్ 138 పరుగులు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఊహాగానాలకు తాను ఆజ్యం పోయనని చెప్పారు.