ప్రియాంక గాంధీ ఫేక్ వీడియోలు.. వాటిలో పెట్టుబడులు పెట్టొద్దంటూ ఆఫీస్ హెచ్చరిక
- ఏఐ టెక్నాలజీతో ప్రియాంక గాంధీ ఫేక్ వీడియోల సృష్టి
- కొన్ని పథకాలలో పెట్టుబడులు పెట్టాలంటూ మోసపూరిత ప్రచారం
- ఇవి పూర్తిగా నకిలీవని స్పష్టం చేసిన ఆమె కార్యాలయం
- వీటిని నమ్మి డబ్బులు పెట్టవద్దని ప్రజలకు హెచ్చరిక
- అనుమానాస్పద పోస్టులను రిపోర్ట్ చేయాలని విజ్ఞప్తి
కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా పేరుతో సామాజిక మాధ్యమాల్లో కొన్ని నకిలీ వీడియోలు విస్తృతంగా ప్రచారమవుతున్నాయి. ఈ పరిణామంపై ఆమె కార్యాలయం తీవ్రంగా స్పందిస్తూ ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతతో సృష్టించిన ఈ వీడియోలను చూసి మోసపోవద్దని స్పష్టం చేసింది.
కొన్ని సంస్థలు, పథకాలలో పెట్టుబడులు పెట్టాలని ప్రియాంక గాంధీ స్వయంగా ప్రోత్సహిస్తున్నట్లుగా ఈ నకిలీ వీడియోలను రూపొందించారు. ఇందుకోసం ఆమె ఛాయాచిత్రాలతో పాటు, ఏఐ ద్వారా ఆమె గొంతును (వాయిస్ క్లోనింగ్) అనుకరించారు. ఇవి అచ్చం ఆమె గొంతులాగే ఉండటంతో ప్రజలు నిజమని నమ్మే ప్రమాదం ఉందని ఆమె కార్యాలయం ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ వీడియోలు పూర్తిగా నకిలీవని, మోసపూరితమైనవని ప్రియాంక గాంధీ కార్యాలయం గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. వీటిని నమ్మి ఎవరూ నగదు పెట్టుబడులు పెట్టవద్దని విజ్ఞప్తి చేసింది. అలాగే, ఇటువంటి వీడియోలతో పాటు వచ్చే అనుమానాస్పద లింకులను అస్సలు క్లిక్ చేయవద్దని హెచ్చరించింది. సామాజిక మాధ్యమాల్లో ఇటువంటి పోస్టులు కనిపిస్తే వెంటనే వాటిని రిపోర్ట్ చేసి, ఆ ఖాతాలను బ్లాక్ చేయాలని ప్రజలకు సూచించింది. డీప్‌ఫేక్ సాంకేతికతను అడ్డుపెట్టుకుని ప్రముఖుల పేర్లతో సాగుతున్న ఆర్థిక మోసాల నుంచి ప్రజలను కాపాడేందుకే ఈ హెచ్చరిక జారీ చేసినట్లు వెల్లడించింది.