వైసీపీ ఆ ఓట్లు వేసుకోకుండా అడ్డుకోగలిగాం: ఆనం రామనారాయణరెడ్డి
- నెల్లూరు జిల్లా యంత్రాంగం వైసీపీకి కొమ్ముకాసిందని ఆరోపణ
- సమస్యాత్మక మర్రిపాడు మండలంలోని బూత్‌లలో మహిళా కానిస్టేబుళ్లను పెట్టారని మండిపాటు
- నెల్లూరులో పదికిపది స్థానాల్లోనూ టీడీపీదే గెలుపని ధీమా
దీనిపై తాము ఫిర్యాదు చేసిన తర్వాత ఆయా బూత్‌ల వద్దకు స్పెషల్ స్క్వాడ్‌ను పంపారని తెలిపారు. వైసీపీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి భార్య ఓ బూత్‌లో తిష్టవేసి తన కొడుక్కి ఓటేయాలంటూ ఓటర్లను ప్రలోభానికి గురిచేశారని చెప్పారు. తాము అడిషనల్ ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఆయనొచ్చి ఆమెను బయటకు పంపారని తెలిపారు.
గత ఎన్నికల్లో ఒకటి నుంచి పది బూత్ లలో ప్రతి దాంట్లోనూ వైసీపీ నాయకులు 5 శాతం ఓట్లను మిగిల్చేవారని, ఆ తర్వాత ఆ ఓట్లను వారు వేసుకునే వారని ఆరోపించారు. ఈసారి అలా జరగకుండా తాము అడ్డుకోవడం ద్వారా ఈ పది బూత్ లలో దాదాపు 3 వేల ఓట్లు వారు వేసుకోకుండా అడ్డుకోగలిగామని తెలిపారు. టీడీపీ ఏజెంట్లను అప్రమత్తం చేయడం వల్లే అది సాధ్యమైందని తెలిపారు. నెల్లూరు జిల్లాలో పదికి పది స్థానాల్లోనూ టీడీపీ విజయం సాధించబోతోందని రామనారాయణరెడ్డి ధీమా వ్యక్తంచేశారు.