Advertisement

క్షమాపణ చెప్పకుంటే లీగల్ నోటీసు పంపుతా.. రేవంత్‌కు కేటీఆర్‌ హెచ్చరిక

KTR demands public apology from CM Revanth Reddy over Globerina row
  • గ్లోబరీనాతో తమకు సంబంధం లేదన్న కేటీఆర్
  • సీఎం ఆరోపణలు పూర్తిగా అసత్యమని వ్యాఖ్య
  • ఆరోపణలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్
  • లేకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక
  • రేవంత్ కనీసం ఒక్కసారైనా ముఖ్యమంత్రిలా ప్రవర్తించాలంటూ ఘాటు విమర్శలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలను వెంటనే ఉపసంహరించుకుని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ మేరకు తన లీగల్ టీమ్ త్వరలోనే ముఖ్యమంత్రికి నోటీసు పంపనుందని వెల్లడించారు.

కొడంగల్‌లో జరిగిన సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ కేటీఆర్ ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. గ్లోబరీనా సంస్థతో బీఆర్ఎస్‌కు గానీ, తన కుటుంబానికి గానీ, తనకు గానీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. పేపర్ లీక్‌లాంటి సున్నితమైన అంశంపై ముఖ్యమంత్రి బాధ్యతారాహిత్యంగా తప్పుడు ఆరోపణలు చేయడం దురదృష్టకరమని విమర్శించారు.

ముఖ్యమంత్రి హోదాలో ఉండి చౌకబారు రాజకీయాల కోసం అసత్యాలను ప్రచారం చేయడం తగదన్నారు. కనీసం ఒక్కసారైనా ముఖ్యమంత్రిలా వ్యవహరించాలని రేవంత్ రెడ్డికి సూచించారు.

తనపై తరచూ అసభ్యకరమైన, అర్థంలేని ఆరోపణలు చేసినప్పటికీ ప్రతి సందర్భంలో స్పందించలేదని కేటీఆర్ పేర్కొన్నారు. తాను మౌనంగా ఉండడాన్ని ఆరోపణలను అంగీకరించినట్లు భావించవద్దన్నారు. ‘‘బురదలో కుస్తీ పట్టడం నాకు ఇష్టం ఉండదు. అందుకే చాలా సందర్భాల్లో స్పందించను’’ అని వ్యాఖ్యానించారు.
Advertisement
KTR
Revanth Reddy
Globerina
Legal Notice
Telangana Politics
BRS Party

More Telugu News