భూమికి దూరంగా జరుగుతున్న చంద్రుడు.. శాస్త్రవేత్తల అధ్యయనంలో ఆసక్తికర విషయాలు!
- ఏడాదికి 3.83 సెం.మీ. దూరమవుతున్న చంద్రుడు
- లేజర్ పరీక్షలతో మార్పును గుర్తిస్తున్న శాస్త్రవేత్తలు
- భూ భ్రమణమే దీనికి ప్రధాన కారణం
- రోజు వ్యవధి క్రమంగా పెరిగే అవకాశం
- శతాబ్దానికి 1-2 మిల్లీసెకన్లు పెరుగుతున్న ఒక రోజు నిడివి
- భవిష్యత్‌లో ఆటుపోట్లు బలహీనపడే అవకాశం
భూమికి చంద్రుడు ప్రతి ఏడాది సుమారు 3.83 సెంటీమీటర్ల వేగంతో దూరమవుతున్నాడని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇది మనిషి గోర్లు పెరిగే వేగంతో సమానమే అయినప్పటికీ, కోట్లాది సంవత్సరాల వ్యవధిలో భూమిపై గణనీయమైన మార్పులకు దారితీసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
అపోలో వ్యోమగాములు 1969-71 మధ్య చంద్రుడిపై ఏర్పాటు చేసిన ప్రత్యేక లేజర్ రిఫ్లెక్టర్ల సాయంతో గత ఐదు దశాబ్దాలుగా ఈ దూరాన్ని అత్యంత కచ్చితత్వంతో కొలుస్తున్నారు. భూమి నుంచి పంపిన లేజర్ కిరణాలు తిరిగి రావడానికి పట్టే సమయాన్ని లెక్కించి చంద్రుడి కక్ష్యలో వస్తున్న మార్పులను గుర్తిస్తున్నారు.
శాస్త్రవేత్తల ప్రకారం దీనికి ప్రధాన కారణం భూభ్రమణం, చంద్రుడి గురుత్వాకర్షణ, సముద్ర అలల ప్రభావం (టైడల్ ఫ్రిక్షన్). భూమి తన అక్షంపై వేగంగా తిరగడం వల్ల చంద్రుడికి కొద్దికొద్దిగా అదనపు శక్తి చేరి, అది క్రమంగా మరింత ఎత్తైన కక్ష్యలోకి వెళ్లిపోతోంది. అదే సమయంలో భూభ్రమణ వేగం స్వల్పంగా తగ్గుతోంది.
ఈ ప్రక్రియ ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో భూమిపై పలు మార్పులు కనిపించనున్నాయి. రోజు నిడివి క్రమంగా పెరుగుతుంది. ప్రస్తుతం ప్రతి శతాబ్దానికి ఒకటి నుంచి రెండు మిల్లీ సెకన్ల మేర రోజు పొడవు పెరుగుతోందని పరిశోధకులు చెబుతున్నారు. దాదాపు 100 కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై ఒక రోజు కేవలం 19 గంటలే ఉండేదని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
మరో కీలక మార్పు సంపూర్ణ సూర్యగ్రహణాలు అంతరించిపోవడం. ప్రస్తుతం చంద్రుడు, సూర్యుడు భూమి నుంచి దాదాపు ఒకే పరిమాణంలో కనిపించడం వల్లే సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతోంది. కానీ చంద్రుడు మరింత దూరమైతే దాని పరిమాణం చిన్నగా కనిపిస్తుంది. దీంతో సుమారు మరో 60 కోట్ల సంవత్సరాల తర్వాత భూమిపై సంపూర్ణ సూర్యగ్రహణాలు కనిపించవని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
అలాగే చంద్రుడి గురుత్వాకర్షణ ప్రభావం తగ్గడంతో సముద్ర అలల తీవ్రత కూడా క్రమంగా తగ్గే అవకాశం ఉంది. ఇది తీరప్రాంత జీవవ్యవస్థలు, సముద్ర జీవుల పునరుత్పత్తి చక్రాలు, మత్స్య సంపదపై దీర్ఘకాలంలో ప్రభావం చూపే అవకాశముందని పరిశోధకులు పేర్కొంటున్నారు.
అయితే ఈ మార్పులన్నీ లక్షల, కోట్ల సంవత్సరాల కాలంలో చోటుచేసుకుంటాయని, ప్రస్తుతం మనుషులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం చంద్రుడు దూరమవుతున్న ప్రక్రియ అత్యంత నెమ్మదిగా కొనసాగుతోందని తెలిపారు.